మృతుడు ఎత్తరి మల్లేశ్(45)
రామగుండం: నిత్యం భార్యను వేధింపులకు గురి చేయడంతో ఓ భార్య భర్తను హతమార్చిన ఘటన రామగుండం పట్టణంలో జరిగింది. రామగుండం సీఐ సాగర్, ఎస్సై పసుల దత్తాత్రి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని శ్రీభక్తాంజనేయస్వామి ఆయలం ఎదుట ఎత్తరి మల్లేశ్–సరిత దంపతులు నివసిస్తుంటారు. వీరికి కుమారుడు భాస్కర్, కూతురు సరిత ఉన్నారు. ఇతడు లారీ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. వీరి ఇంటి పక్కనే తమ్ముడు విజయ్‌కుమార్ నివాసం ఉంది. కాగా మల్లేశ్ తరచూ వివిధ కారణాలతో భార్య సరితను వేధిస్తుంటాడు. భార్య సరిత తల్లిగారు వరంగల్ జిల్లాలోని మడికొండ మండల పరి«ధిలో రాంపూర్ గ్రామంలో ఒక ఆస్తిని రాసిచ్చారు. దానిని విక్రయించి డబ్బులు తీసుకురమ్మని భార్య సరితపై చేయి చేసుకుంటూ అసభ్యకరంగా వ్యవహరించేవాడు.
దీంతో భార్య సహనం కోల్పోయి తన మరిది విజయ్‌తో కలిసి ఆదివారం రాత్రి మల్లేశ్ నిద్రిస్తున్న సమయంలో విచక్షణారహితంగా కత్తులు, గడ్డపారతో పొడిచి హతమార్చారు. స్థానికులు గుర్తించి రామగుండం పోలీసులకు సమాచారమివ్వడంతో గోదావరిఖని ఏసీపీ రక్షిత కె.మూర్తి, రామగుండం సీఐ, ఎస్సైలు ఘటన స్థలిలో విచారించారు. అక్కడే ఉన్న గడ్డపార, రెండు కత్తులను స్వాధీనం చేసుకొని మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు మృతుడి భార్య సరిత, మృతుడి తమ్ముడు విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment