ఆర్థిక ఇబ్బందులతో భార్య ఆత్మహత్యాయత్నం
అది చూసి గుండెపోటుతో భర్త మృతి
కళ్యాణదుర్గం రూరల్ : ఆర్థిక ఇబ్బందులతో భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. అది చూసి తట్టుకోలేక గుండెపోటుతో భర్త మృతి చెందిన ఘటన పట్టణంలోని విద్యానగర్‌లో బుధవారం జరిగింది. టౌన్ పోలీసుల కథనం ప్రకారం...బెళుగుప్ప మండలం ఎర్రగుడి గ్రామానికి చెందిన ఎర్రిస్వామి(50), బోయ పద్మావతి(42) దంపతులు గత కొన్నేళ్లుగా పట్టణలో నివాసం ఉంటున్నారు. బోరు ఏజెంటుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల బోరు కొనుగోలు చేసి వ్యాపార లావా దేవీలను కొనసాగించే క్రమంలో అప్పులు అధికమయ్యాయి.
మంగళవారం రాత్రి భార్య, భర్తలు ఇంట్లో ఉన్నారు. వారి మధ్యలో ఏం జరిగిందో కానీ భార్య పద్మావతి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇంట్లో ఉన్న ఎర్రిస్వామి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా చేతులు, కాళ్లకు గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వీరిని 108లో కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కొద్ది క్షణాల్లోనే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. అయితే ఎర్రిస్వామి భార్యతో పాటు ఆస్పత్రిలోనే ఉన్నాడు.
బుధవారం తెల్లవారు జామున గుండె పోటుతో మృతి చెందాడు. కడుపు నొప్పి అధికం కావడంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని జూనియర్ సివిల్ జడ్జి నాగరాజకు వాగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. వ్యాపార నిమిత్తం సుమారు రూ.10లక్షల అప్పులు ఉన్నట్లు బంధువులు తెలిపారు. వీరికి నంద కిషోర్(డిగ్రీ), పవన్ కళ్యాణ్ (ఇంటర్)కుమారులు ఉన్నారు. టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యానగర్‌లో విషాదం
Published Thu, May 7 2015 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM
Advertisement
Advertisement