Wife commit suicide
-
మూడేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి.. రెండు రోజులకే జీవితంలో సుడిగుండం..
మనోహరాబాద్(తూప్రాన్): ప్రేమించాడు..పెళ్లి చేసుకున్నాడు.. రెండురోజులకే ఇద్దరి కులాలు వేరంటూ వదిలేశాడు. తనకు న్యాయం చేయాలంటూ ఆ యువతి వేడుకున్నా కనికరించలేదు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగింది. నెల రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. దీంతో మృతురాలు కుటుంబీకులు, బంధువులు మృతదేహాన్ని ఆ యువకుడి ఇంటి వద్ద ఉంచి ఆందోళనకు దిగారు. ఈ విషాద ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తుప్రాన్ మండలపరిధిలోని ధర్మరాజ్పల్లి గ్రామానికి చెందిన యశ్వంత్‌రెడ్డి, అదే గ్రామానికి చెందిన బాషబోయిన తేజశ్రీ (18)లు మూడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. గతేడాది అక్టోబర్ 15న పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్ 19న పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు కాపురం చేసుకుంటామని ఒప్పుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరుకావడంతో విభేదాలు వచ్చాయి. యువతికి అండగా కులపెద్దలు ఉండి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపినా ఎలాంటి న్యాయం జరగలేదు. దీంతో, ఆ యువతి పురుగుల మందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. నెల రోజులుగా చికిత్స పొందుతున్న తేజశ్రీ మంగళవారం వేకువజామున మృతి చెందింది. తేజశ్రీ మృతదేహాన్ని యశ్వంత్‌రెడ్డి ఇంటివద్ద ఉంచి ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ శ్రీధర్, ఎస్ఐ సందీప్‌రెడ్డిలు సంఘటన స్థలానికి వచ్చి ఆందోళనకారులకు నచ్చజె ప్పారు. పోలీసులు చివరికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి అంత్యక్రియలు చేశారు. -
నరకం అనుభవించలేక.. నిత్యం పోరాడలేక..
కట్టుకున్న వాడి దురాశ, అత్త వేధింపులకు తోడు ముగ్గురు ఆడ బిడ్డలకు జన్మనీయడమే ఆ తల్లికి శాపమైంది. క్షణక్షణం అనుభవిస్తున్న నరకం నుంచి విముక్తి పొందేందుకు బలవన్మరణాన్ని ఆశ్రయించింది. అత్తింటివారితో పోరాడి అలసిపోయింది. ఇక మరణమే శరణ్యమనుకుంది. చంటి బిడ్డలతో సహా బలవన్మరణానికి పాల్పడింది. శాంతిపురం మండలంలో శనివారం జరిగిన ఈ సంఘటన విషాదం నింపింది. శాంతిపురం: దండికుప్పం పంచాయతీలోని నల్ల రాళ్లపల్లికి చెందిన బేబి(26) ఏడు నెలల వయసున్న కవల పిల్లలతో సహా పాలారు నదిలో దూకి ప్రాణా లు విడిచిన సంఘటన కలకలం సృష్టించింది. కోటి ఆశలతో 2011లో సొంత వూర్లోనే అత్తింట అడుగుపెట్టిన బేబికి ఆది నుంచి వేధింపులే ఎదురయ్యా యి. పెళ్లయిన మూడు నెలలకే ఆస్తి కోసం భర్త కోదండ, అత్త గోవిందమ్మల నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఆస్తిలో వాటా తీసుకురావాలని పుట్టింటికి తరిమేశారు. తండ్రి వెంకటాచలం(జలమప్ప), తల్లి పద్మమ్మలు స్థానికుల సాయంతో సర్దుబాటు చేసి ఆమెను మళ్లీ అత్తింటికి పంపారు. అయినా ఇంట్లో గొడవలు తగ్గలేదు. బేబిని తరచూ హింసిస్తుండటంతో స్థానికులు కలగజేసుకునేవారు. కానీ జోక్యం చేసుకున్న వారిని భర్త, అత్తలు దుర్బాషలాడటం, మగ వారికి అక్రమ సంబంధం అంటగట్టి అసభ్యంగా మాట్లాడటంతో స్థానికులు దూరమయ్యారు. మూడేళ్ల క్రితం బేబి ప్రతీకకు జన్మనిచ్చింది. అంతా సర్ధుకుంటుందని పుట్టింటి వారు భావించినా పరిస్థితిలో మార్పు లేకపోయింది. పుట్టింటికి వెళ్లకుండా, వారితో పాటు స్థానికులతో కూడా మాట్లాడకుండా అత్తింటివారు బేబిని కట్టడి చేశారు. ఆడబిడ్డలకు జన్మనివ్వటమే శాపం.. ఏడు నెలల క్రితం బేబీ కవల బిడ్డలకు జన్మనిచ్చింది. ఆడబిడ్డలు కావడంతో వేధింపులు పతాక స్థాయికి చేరాయి. తరచూ భర్త, అత్త చేయి చేసుకునే వారని, బిడ్డలకు జన్మనిచ్చిన ఆరు రోజుల నుంచే బలవంతంగా వ్యవసాయ పనులు చేయించారని స్థానిక మహిళలు చెబుతున్న మాటలు బేబీ ఎదుర్కొన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. శుక్రవారం ఉదయం ఇంట్లో పాలు ఒలికిపోయానే కారణంతో అత్త, భర్త బేబిని చితగ్గొట్టారు. వారు పనులకు వెళ్లగానే ముక్కు పచ్చలారని చంటి బిడ్డలతో సహా ఇంటి నుంచి వెళ్లి సమీపంలోని పాలారు నదిలో పడి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసి సమీప గ్రామాల వారు అక్కడికి చేరుకున్నారు. బేబి పరిస్థితులను తెలుసుకుని ఇలాంటి కష్టాలు ఎవరికీ రాకూడదని వెనుదిరిగారు. తల్లి, తోబుట్టువుల కోసం అమాయకంగా ఎదురు చూస్తున్న ప్రతీక(3) మాటలు జనం గుండెలను పిండాయి. -
శాడిష్టు మొగుడి దెబ్బలకు గృహిణి బలి
-
భర్త తాగుడు మానడం లేదని..
* వివాహిత ఆత్మహత్యాయత్నం * పరిస్థితి విషమం కామారెడ్డి : రోజూ మద్యం తాగి వచ్చే భర్తను తాగుడు మానుకోవాలని ఎన్నిసార్లు కోరినా మార్పు రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు యత్నించింది ఓ ఇల్లాలు.. దేవునిపల్లి ఎస్సై నవీన్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అడ్లూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని డ్రైవర్స్ కాలనీకి చెందిన క్యాతం గంగ భర్త రాములు నిత్యం తాగేవాడు. తాగుడు మానుకోవాలని భార్య ఎంత కోరినా పట్టించుకునేవాడు కాదు. తాగుడు మానకపోతే చనిపోతానని హెచ్చరించినా పెడచెవిన పెట్టాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన గంగ.. మంగళవారం ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు మంటలు ఆర్పి కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గంగ పరిస్థితి విషమంగా ఉందని ఎస్సై తెలిపారు. -
విద్యానగర్‌లో విషాదం
ఆర్థిక ఇబ్బందులతో భార్య ఆత్మహత్యాయత్నం అది చూసి గుండెపోటుతో భర్త మృతి కళ్యాణదుర్గం రూరల్ : ఆర్థిక ఇబ్బందులతో భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. అది చూసి తట్టుకోలేక గుండెపోటుతో భర్త మృతి చెందిన ఘటన పట్టణంలోని విద్యానగర్‌లో బుధవారం జరిగింది. టౌన్ పోలీసుల కథనం ప్రకారం...బెళుగుప్ప మండలం ఎర్రగుడి గ్రామానికి చెందిన ఎర్రిస్వామి(50), బోయ పద్మావతి(42) దంపతులు గత కొన్నేళ్లుగా పట్టణలో నివాసం ఉంటున్నారు. బోరు ఏజెంటుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల బోరు కొనుగోలు చేసి వ్యాపార లావా దేవీలను కొనసాగించే క్రమంలో అప్పులు అధికమయ్యాయి. మంగళవారం రాత్రి భార్య, భర్తలు ఇంట్లో ఉన్నారు. వారి మధ్యలో ఏం జరిగిందో కానీ భార్య పద్మావతి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇంట్లో ఉన్న ఎర్రిస్వామి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా చేతులు, కాళ్లకు గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వీరిని 108లో కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కొద్ది క్షణాల్లోనే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. అయితే ఎర్రిస్వామి భార్యతో పాటు ఆస్పత్రిలోనే ఉన్నాడు. బుధవారం తెల్లవారు జామున గుండె పోటుతో మృతి చెందాడు. కడుపు నొప్పి అధికం కావడంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని జూనియర్ సివిల్ జడ్జి నాగరాజకు వాగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. వ్యాపార నిమిత్తం సుమారు రూ.10లక్షల అప్పులు ఉన్నట్లు బంధువులు తెలిపారు. వీరికి నంద కిషోర్(డిగ్రీ), పవన్ కళ్యాణ్ (ఇంటర్)కుమారులు ఉన్నారు. టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.