భర్త తాగుడు మానడం లేదని.. | The husband did not stop drinking .. | Sakshi
Sakshi News home page

భర్త తాగుడు మానడం లేదని..

Published Wed, Apr 20 2016 1:33 AM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

The husband did not stop drinking ..

* వివాహిత ఆత్మహత్యాయత్నం
* పరిస్థితి విషమం

కామారెడ్డి : రోజూ మద్యం తాగి వచ్చే భర్తను తాగుడు మానుకోవాలని ఎన్నిసార్లు కోరినా మార్పు రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు యత్నించింది ఓ ఇల్లాలు.. దేవునిపల్లి ఎస్సై నవీన్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అడ్లూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని డ్రైవర్స్ కాలనీకి చెందిన క్యాతం గంగ భర్త రాములు నిత్యం తాగేవాడు. తాగుడు మానుకోవాలని భార్య ఎంత కోరినా పట్టించుకునేవాడు కాదు. తాగుడు మానకపోతే చనిపోతానని హెచ్చరించినా పెడచెవిన పెట్టాడు.

దీంతో జీవితంపై విరక్తి చెందిన గంగ.. మంగళవారం ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు మంటలు ఆర్పి కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గంగ పరిస్థితి విషమంగా ఉందని ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement