తిరుమలాయపాలెం: తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి భర్త తాగే మద్యంలో విషం (కుక్కలను సంహరించే మంద) కలిపి హతమార్చిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఆమెకు సహకరించిన ప్రియుడిని సైతం అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సుబ్లేడు గ్రామానికి చెందిన దావా కనకరాజు (37)కు భార్య విజయతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆమెకు గ్రామానికే చెందిన పంచాయతీ వాటర్‌మెన్ ఓర పాపయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు విషయం బయటపడటంతో దంపతుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో విజయ పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పాపయ్యతో ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలో భర్తను అడ్డుతొలగించుకోవాలని ఇద్దరు కలిసి నిర్ణయించారు.
సూర్యాపేట జిల్లా మోతె మండలం తుమ్మగూడెంలో కృష్ణ అనే వ్య క్తి వద్ద కుక్కల మందు కొనుగోలు చేసి గతనెల 30న రాత్రి సమయంలో షేక్ మస్తాన్ ద్వారా ఓ మద్యం బాటిల్‌లో కలిపి కనకరాజుకి ఇవ్వాలని చెప్పి పంపించారు. ఆ మందు తాగిన కనకరాజు ఇంటికి వెళ్లాక కాళ్లు, చేతులు లాగుతున్నాయని చెప్పడంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తనకు మారుడి మృతిపై అనుమానం ఉందని, మద్యంలో విషం కలిపి ఉంటారని తల్లి భద్రమ్మ ఫిర్యాదు చేసింది. ప్రియుడితో కలిసి ఉండేందుకు తన భర్త అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే విజ య ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని పోలీసుల వి చారణలో తేలింది. దీంతో ఓర పాపయ్య, దావా విజయను సోమవారం అరెస్టుచేసి రిమాండ్‌కు త రలించినట్లు కూసుమంచి సీఐ సతీశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment