
మైసూరు: రోజూ మద్యం తాగి వచ్చి ఇంటిలో గొడవ చేస్తున్న భర్తకు బుద్ధి మాటలు చెప్పిన భార్య శవమై తేలింది. వివరాలు.. మైసూరు నగరంలోని క్యాతమారనహళ్లిలో సంధ్య (25), భర్త కిరణ్ (27) 4 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక కుమార్తె ఉంది. కిరణ్ ప్రతి రోజు మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవపడేవాడు.
ఈ పోరు తట్టుకోలేక సంధ్య తన భర్తను మద్యం మాన్పించే ఆశ్రయ కేంద్రంలో చేర్పించింది. మూడు నెలలపాటు అక్కడ ఉండి వచ్చిన కిరణ్.. నన్ను మందు మాన్పించడానికి పంపిస్తావా? అని భార్యతో పోట్లాటకు దిగి ఆమెను గొంతుపిసికి హత్య చేశాడు. ఉదయగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment