Strangled wife
-
మద్యం మానిపించేందుకు యత్నించిందని భార్యను గొంతునులిమి చివరికి...
మైసూరు: రోజూ మద్యం తాగి వచ్చి ఇంటిలో గొడవ చేస్తున్న భర్తకు బుద్ధి మాటలు చెప్పిన భార్య శవమై తేలింది. వివరాలు.. మైసూరు నగరంలోని క్యాతమారనహళ్లిలో సంధ్య (25), భర్త కిరణ్ (27) 4 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక కుమార్తె ఉంది. కిరణ్ ప్రతి రోజు మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవపడేవాడు. ఈ పోరు తట్టుకోలేక సంధ్య తన భర్తను మద్యం మాన్పించే ఆశ్రయ కేంద్రంలో చేర్పించింది. మూడు నెలలపాటు అక్కడ ఉండి వచ్చిన కిరణ్.. నన్ను మందు మాన్పించడానికి పంపిస్తావా? అని భార్యతో పోట్లాటకు దిగి ఆమెను గొంతుపిసికి హత్య చేశాడు. ఉదయగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్డుగా ఉందని.. హతమార్చాడు
గుంటూరు(పత్తిపాడు): అడ్డు తొలగించుకునేందుకు భార్య గొంతు నులిమి చంపేశాడో భర్త. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని పత్తిపాడు మండలం పాతలమల్లాయపాలెంలో బుధవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గతంలో జయ అనే మహిళను ఏసు అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. అత్యాచారం కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అనంతరం భర్త ఏసు భార్య జయ అడ్డు ఎలాగైనా తొలగించుకోవాలనుకున్నాడు. అయితే దంపతులు ఏసు, జయ కర్నూలు జిల్లా పల్లవాడు గ్రామంలో నివాసముంటున్నారు. పథకం ప్రకారం.. ఏసు తన భార్యను వారం క్రితం మిర్చి కోతల కోసం పాతమల్లాయపాలెం తీసుకవెళ్లాడు. అనుకున్నట్టుగానే అక్కడే భార్య గొంతునులిమి హతమార్చినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.