దారుణం: భర్తకు విషపు ఇంజక్షన్‌ ఇచ్చి.. | cheated wife kills husband for unlike | Sakshi
Sakshi News home page

దారుణం: భర్తకు విషపు ఇంజక్షన్‌ ఇచ్చి..

Published Thu, May 4 2017 8:37 AM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM

దారుణం: భర్తకు విషపు ఇంజక్షన్‌ ఇచ్చి.. - Sakshi

దారుణం: భర్తకు విషపు ఇంజక్షన్‌ ఇచ్చి..

బెంగుళూరు: తనకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గి వివాహం చేసుకున్న ఓ యువతి తన భర్తకు విషపు ఇంజక్షన్‌ ఇచ్చి అతడి చావుకు కారణమైంది. హాసన్‌ నగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ వివరాలిలా ఉన్నాయి... హాసన్‌ సమీపంలోని కిత్తనగర గ్రామానికి చెందిన విశ్వనాథ్‌(28), ఆశ(25)కు ఈ ఏడాది ఫిబ్రవరి 16న వివాహమైంది. మెట్టినింటికి వెళ్లి సేద్యం పనులు చేయలేనని భర్తకు తెగేసి చెప్పిన ఆమె కొన్నిరోజులకే పుట్టింటికి వచ్చేసింది. పెద్దలు పంచాయతీ పెట్టి సర్దిచెప్పి ఆమెను భర్త వద్దకు పంపారు.

ఈ క్రమంలో తన భర్తను స్నేహితుడి బర్త్‌డే పార్టీకి తీసుకెళ్లింది. హాసన్‌మహారాజ పార్కులో భర్తకు విషం మాత్రలు మింగించి విషం ఇంజెక్షన్‌ వేసి ఇంటికి వెళ్లిపోయింది. తన భర్త ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదని నాటకం ఆడింది. ఇదిలా ఉండగా స్పృహలోకి వచ్చిన విశ్వనాథ్‌ అతికష్టం మీద ఇంటికి చేరుకుని జరిగిన విషయం తల్లిదండ్రులకు వివరించాడు. దీంతో వెంటనే అతడిని హాసన్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆ తర్వాత మైసూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై హాసన్‌ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement