Pamban
-
పగపట్టాడు
ఇదివరకు చాలా సినిమాల్లో సాగరకన్యను చూశారు. ఇప్పుడు సాగర వీరుడుని చూపించబోతున్నాం అంటున్నారు తమిళ హీరో శరత్‌కుమార్. ఏ.వెంకటెశ్ దర్శకత్వంలో శరత్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పాంబన్’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్స్‌లో శరత్ కుమార్ సగం మనిషి, సగం సర్పంలా కొత్త అవతారంలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఈ గెటప్ చూడగానే మనిషి సర్పంగా మారాడా లేక సర్పం మనిషిగా మారిందా? అనే అసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. పాము పగపట్టిందంటే తీర్చుకునే వరకు వదలదు అంటారు. మరి ఆగ్రహం నిండిన కళ్లు, చేతిలో శూలం చూస్తుంటే ఈ పాము మనిషి ఎవరి మీదో పగతో రగిలిపోతున్నట్టుగా ఉంది కదూ. మరి ఈ సినిమాలో ‘సర్ప మనిషి’గా కనిపిస్తున్న శరత్‌కుమార్ ఎవరి మీద బుసలు కొడతాడో? ఎలా పగ తీర్చుకుంటాడో చూడాలి. గతంలో దర్శకుడు వెంకటేశ్– శరత్‌కుమార్ కాంబినేషన్లో ‘మహాప్రభు, చాణక్య’ వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఈసారి కూడా హిట్ ఖాయం అంటున్నారు. -
భయపెడుతున్న సీనియర్ నటుడు
తెలుగులో సహాయ పాత్రల్లో ఆకట్టుకుంటున్న సీనియర్ నటుడు శరత్‌కుమార్ కోలీవుడ్ లో లీడ్ రోల్స్‌లో నటిస్తూ అలరిస్తున్నాడు. తమిళ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సీనియర్ స్టార్ వెండితెరపై ఆసక్తికర పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన కెరీర్ లోనే తొలి సారిగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంలో నటించబోతున్నారు శరత్ కుమార్. గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కనున్న ఈ ఫాంటసీ మూవీ పాంబన్ అనే టైటిల్ తో రూపొందుతోంది. ఈ సినిమా రోజు బుధవారం చెన్నై లో ప్రారంభమయ్యింది. సినిమా ఓపెనింగ్ సమయంలోనే ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. శరత్ కుమార్ స్నేక్ మ్యాన్‌గా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్స్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ఈ ఏడాది చివర్లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వెంకటేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ దేవా సంగీత మందిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
చెన్నైలో భారీ వర్షాలు
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు చెన్నైతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. 30 డిగ్రీల సెల్సియస్ కిందకు పడ్డాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 24 గంటల్లో చెన్నైలో 67 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ప్రాంతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. 2010 తర్వాత మే నెలలో ఒక్కరోజులో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదేనని తెలిపింది. 2010, మే 10న చెన్నైలో 109.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో చెన్నై వాసులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఓటు వేయడానికి స్వస్థలాలకు వెళ్లి నగరానికి తిరిగొచ్చేవారు ట్రాఫిక్ లో చిచ్చుకుపోయారు. మంగళ, బుధవారాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. పంబన్ లో అత్యధికంగా 79.6 మిల్లీమీటర్లు, నాగపట్టణంలో 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.