Comedian Venkatesh Wife Hires Rowdies To Break His Legs Due To Illegal Affair, Details Inside - Sakshi
Sakshi News home page

వేరొక మహిళ కోసం భార్యకు విడాకుల నోటీసులు? అందుకే కిరాయి గూండాలతో..!

Jun 21 2023 4:40 PM | Updated on Jun 21 2023 5:12 PM

Comedian Venkatesh Wife Hires Rowdies to Break Legs Due to Illegal Affair - Sakshi

భార్య భానుమతికి, డ్రైవర్‌ మోహన్‌కు వివాహేతర సంబంధం ఉందని, తన అడ్డు తొలగించుకోవాలనే ఈ పని చేసి దాన్ని వేరే పార్టీ మీదకు తోసేస్తోందని ఆరోపిస్తున్నాడు

'అసత పోవతు యారు', 'కలకప్పోవత్తు యారు' వంటి కామెడీ షోలతో తళుక్కుమని మెరిశాడు తమిళ కమెడియన్‌ వెంకటేశ్‌. బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షోల ద్వారా ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న ఆయన గురించి ఓ వార్త అటు కోలీవుడ్‌లో ఇటు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీని ప్రకారం.. కమెడియన్‌ వెంకటేశ్‌ కొన్ని రోజుల కిందట తన కారులో ప్రయాణిస్తున్న సమయంలో అతడిపై దాడి జరిగింది. ముగ్గురు వ్యక్తులు కారును ఆపి అందులో ఉన్న డ్రైవర్‌ను వెళ్లిపోమని బెదిరించారు.

పొదల్లోకి తీసుకెళ్లి చితక్కొట్టారు
దీంతో కారు డ్రైవర్‌ మోహన్‌ భయంతో అక్కడి నుంచి పారిపోగా సదరు దుండగులు వెంకటేశ్‌ను పక్కనే ఉన్న చెట్లపొదల్లోకి తీసుకెళ్లి చితకబాదారు. అతడి ఆర్తనాదాలు విన్న స్థానికులు అక్కడికి పరిగెత్తుకుంటూ రావడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. గాయాలపాలైన కమెడియన్‌ను ఆస్పత్రిలో చేర్పించగా అతడి కాళ్లు ఫ్రాక్చర్‌ అయినట్లు తెలిసింది. 

కమెడియన్‌ భార్యకు డ్రైవర్‌తో ఎఫైర్‌?
అయితే ఘటనా స్థలంలో బీజేపీ జెండాలు కనిపించడంతో ఇది ఆ పార్టీ కార్యకర్తల పనే అయ్యుంటుందని పోలీసులు భావించారు. వెంకటేశ్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులను వ్యతిరేకించినవారే ఈ దాడి చేయించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ వెంకటేశ్‌ వాదన మరోలా ఉంది. తన భార్య భానుమతికి, డ్రైవర్‌ మోహన్‌కు వివాహేతర సంబంధం ఉందని, తన అడ్డు తొలగించుకోవాలనే ఈ పని చేసి దాన్ని వేరే పార్టీ మీదకు తోసేస్తోందని ఆరోపిస్తున్నాడు. డబ్బులిచ్చి మరీ గూండాలతో తనపై దాడి చేయించిందని పేర్కొంటున్నాడు.

కమెడియన్‌ ఎఫైర్‌, కాళ్లు విరగ్గొట్టిన భార్య
అయితే వెంకటేశ్‌కు కోయంబత్తూరుకు చెందిన మహిళతో ఎఫైర్‌ ఉందని, ఆమె కోసం భార్య భానుమతికి విడాకుల నోటీసులు కూడా పంపించినట్లు తెలుస్తోంది. భర్తను దూరం చేసుకోవడం ఇష్టం లేక అతడి కాళ్లు విరగ్గొట్టి తనతో పాటు ఇంట్లో ఉండిపోయేందుకు ఆమె స్కెచ్‌ వేసి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. మరి పోలీసుల విచారణలో ఏం తేలనుందో చూడాలి!

చదవండి: అసభ్య సందేశాలు.. భర్తపై నటి ఫిర్యాదు
బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement