
రజనీ రాజకీయాల్లోకొస్తే ఎదిరిస్తా: హీరో
చెన్నై : తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమిళనాడు సీఎం జయలలిత మరణంతో సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఎదిరించేవారిలో మొదట తానే ఉంటానని సమత్తవ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్ కుమార్ అన్నారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
శరత్ కుమార్కు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. వేలూరులో శరత్ కుమార్ దిష్టి బొమ్మలను రజనీ అభిమానులు దగ్ధం చేశారు.