రేయాన్, రాధిక
‘‘ఇలాంటి ప్రపంచంలో జీవిస్తున్నాం మనం (ఆగ్రహావేదన). అవును.. మా నాన్నగారు సూపర్ బ్లెస్డ్. అద్భుతమైన భార్య దొరికారు. నలుగురు సంతానం ఉన్నారు. ఒక మనవడు ఉన్నాడు. ఆయన్ను ఎంతగానో ప్రేమించే కుటుంబం ఉంది. మాది మిక్స్‌డ్ ఫ్యామిలీ. మమ్మల్ని ట్రోల్ (విమర్శించే) చేసే వారి మనసుల్లోని ద్వేషం స్థానంలో ప్రేమ నిండుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రేయాన్. ఈ పేరు ఎక్కడా విన్నట్లు లేదే అనుకుంటున్నారా? నటిరాధిక మొదటి కుమార్తె రేయాన్. కాగా, శరత్‌కుమార్, రాధికలు 18 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు.
ఇటీవల శరత్ కుమార్, రాధికల పెళ్లిరోజు సందర్భంగా రేయాన్ తన కొడుకుతో శరత్–రాధికలు ఉన్న ఫోటోను ‘లవ్‌బర్డ్స్. హ్యాపీ యానివర్సరీ’ అనే ట్యాగ్‌తో సోషల్‌మీడియాలో షేర్ చేశారు. రేయాన్ చేసిన ఈ పోస్ట్‌ను కొందరు నెటిజన్లు ‘‘శరత్‌కుమార్ ఈజ్ బ్లెస్డ్. రెండో భార్య రాధిక మొదటి కుమార్తె (రేయాన్) కొడుకుతో శరత్ కుమార్’’ అని హేళన చేసే విధంగా పేర్కొన్నారు. ఈ కామెంట్‌కే రేయాన్. పైవిధంగా స్పందించారు. రేయాన్ చేసిన పోస్ట్‌ను రాధిక ట్యాగ్ చేసి...‘‘రేయాన్.. మన బాధ ఎవరికీ తెలీదు. కానీ మన మధ్య ఉన్న ప్రేమ, అనుబంధాలను చూడటానికి అర్హత లేని గుడ్డివారు ట్రోల్ చేస్తున్నారు. వారిని అలాగే వదిలేయ్. అలాగే వేదనతో బతకనివ్వు. మనం మనలాగే హ్యాపీగా ఉందాం’’ అని అన్నారు రాధిక.
Comments
Please login to add a commentAdd a comment