సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, ఆల్ ఇండి యా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ శనివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి తతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని కవిత నివాసంలో జరిగిన ఈ భేటీలో దేశ రాజకీయాలపై సుదీర్ఘంగా చ ర్చించారు. బీఆర్‌ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎజెండా తదితర అంశాలపై ఇరువు రూ మాట్లాడుకున్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ కార్య కలాపాల విస్తరణ ప్రణాళికలో భాగంగా వివి ధ రాష్ట్రాలకు చెందిన నేతలు సీఎం కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత, పలువురు మంత్రుల తో సమావేశమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవితతో శరత్‌కుమార్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. భేటీ అనంతరం శరత్‌కుమార్‌కు కవిత పోచంపల్లి శాలువాతో పాటు జ్ఞాపికను అందజేశారు.
స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను సరిదిద్దాలి..
స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులను సరిదిద్దేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ న్, సెబీ చీఫ్ మధాబి పూరిబుచ్ చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా కవిత డిమాండ్ చేశారు. ప్రముఖ వాణిజ్య సంస్థ అదానీ గ్రూప్ పై ఇటీవలి అంతర్జాతీయ నివేదిక తర్వాత ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, ఇతర కంపెనీల షేర్లలో తగ్గుదల, ఒడిదుడుకులు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
చదవండి: ఇంటెలిజెన్స్’తో లోపాలకు చెక్! ఆస్తిపన్ను ఆదాయం పెంపునకు జీహెచ్‌ఎంసీ చర్యలు
Comments
Please login to add a commentAdd a comment