
రజనీకాంత్-శరత్ కుమార్ (ఫైల్ ఫోటోలు)
సాక్షి, చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్‌పై నటుడు శరత్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రజనీ సందర్భవాద రాజకీయాలు చేస్తున్నాడంటూ మండిపడ్డాడు. ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పార్టీ అధినేత అయిన శరత్ కుమార్ మంగళవారం పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా రజనీ రాజకీయ అరంగ్రేటంపై శరత్‌కుమార్ స్పందించాడు. ‘‘రజనీకాంత్ సందర్భవాద రాజకీయాలు చేస్తున్నారు. అసలు రజనీ చూపించే గుర్తు బాబాది కాదు. అది మేక తలకాయ. అదీ ఓ సీక్రెట్ సోసైటీకి చెందిన సింబల్’’.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
1996లో జయలలితకు భయపడి విదేశాలకు పారిపోయిన రజనీ మళ్లీ కరుణానిధి ప్రభుత్వం వచ్చాకే ఇక్కడికి తిరిగొచ్చాడని... అవకాశ వాద రాజకీయాలతో రజనీ లాభం పొందాలని చూస్తున్నాడంటూ శరత్ కుమార్ మండిపడ్డారు. కావేరి జలవివాదంపై రజనీ తన వైఖరేంటో స్పష్టం చేయాలని శరత్‌కుమార్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment