యాక్టర్‌ విజయ కుమార్ మనవరాలి పెళ్లి.. వీడియో వైరల్‌ | Vijay Kumar Grand Daughter Thiyya Marriage | Sakshi
Sakshi News home page

యాక్టర్‌ విజయ కుమార్ మనవరాలి పెళ్లి.. వీడియో వైరల్‌

Published Thu, Feb 15 2024 2:28 PM | Last Updated on Thu, Feb 15 2024 2:53 PM

Vijay Kumar Grand Daughter Thiyya Marriage - Sakshi

టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న ప్రముఖ నటుడు విజయ కుమార్. ఆయన మనుమరాలి పెళ్లి ఈ నెలలో జరగనుంది. ఆ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. విజయ కుమార్‌కు రెండు వివాహాలు జరిగాయి. ఆయన మొదటి భార్య ముత్తులక్ష్మి, రెండవ భార్య సినీనటి మంజుల. ఇతనికి మొత్తం ఆరుగురు పిల్లలు. మొదటి భార్య ద్వారా ఇద్దరు కూతుర్లు కవిత, అనిత ఉన్నారు. రెండవ భార్య ద్వారా ముగ్గురు కూతుర్లతో పాటు కుమారుడు అరుణ్‌ ఉన్నాడు. అతను నటుడిగా స్థిరపడితే ముగ్గురు కూతుర్లు వనిత, ప్రీత, శ్రీదేవి  కొన్ని సినిమాలలో నటించారు. వీరందరికీ వనిత విజయ కుమార్‌ మాత్రం ఒంటరిగా దూరంగా ఉన్నారు.


(భర్త గోకుల్ కృష్ణన్‌తో అనిత విజయ కుమార్‌) 

విజయ్‌ కుమార్‌ పిల్లలు అందరూ సినిమా పరిశ్రమకు దగ్గర్లో ఉన్న వారే.. కానీ ఆయన మొదటి భార్య కుమార్తె అయిన అనిత మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇప్పుడు ఆమె కూతురు ధియాకు వివాహం కానుంది. 1973లో జన్మించిన అనితా విజయకుమార్‌ ప్రముఖ డాక్టర్‌గా ఉన్నారు. గోకుల్ కృష్ణన్ అనే వైద్యుడిని పెళ్లి చేసుకుని ఖతార్‌లో ఆమె స్థిరపడ్డారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అనిత కూతురు థియా కూడా డాక్టర్‌గా స్థిరపడింది.

గతేడాదిలో తిలాన్‌ అనే యువకుడితో థియా నిశ్చితార్థం కూడా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో థియా- తిలాన్ జంట ఈ నెలలో ఒకటి కానున్నారు. వారి పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెళ్లి తేదీ తెలియాల్సి ఉంది. 

ఈ పెళ్లికి అనిత తన తండ్రి విజయకుమార్, సోదరి కవితతో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందజేస్తున్నారు. ఆ విధంగా రజనీ, సూర్య, ధనుష్ కుటుంబాలను అనిత స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆమె విడుదల చేశారు. తాజాగా తన కూతురు ఖతార్‌ నుంచి చెన్నైకి వచ్చింది. ఆ వీడియోను అనిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అందులో థియా అమ్మమ్మ హారతి ఇవ్వడం చూడొచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement