తాత - మనవళ్ల కథ | Hero sunil about srirama raksha movie Teaser | Sakshi
Sakshi News home page

తాత - మనవళ్ల కథ

Nov 10 2016 11:05 PM | Updated on Sep 4 2017 7:44 PM

తాత - మనవళ్ల కథ

తాత - మనవళ్ల కథ

‘‘శ్రీరామరక్ష’ చిత్రం టీజర్ చూస్తుంటే ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమా చూస్తున్నప్పటి ఫీలింగ్ కలిగింది.

‘‘శ్రీరామరక్ష’ చిత్రం టీజర్ చూస్తుంటే ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమా చూస్తున్నప్పటి  ఫీలింగ్ కలిగింది. టైటిల్ చక్కగా ఉంది. అందుకు తగ్గట్టే చిత్ర యూనిట్‌కు శ్రీరాముని ఆశీస్సులుండాలి’’ అని హీరో సునీల్ అన్నారు. రజిత్, షామిలి, నిషా, విజయ్‌కుమార్, షఫీ, జ్యోతి ముఖ్య పాత్రల్లో రాము దర్శకత్వంలో వశిష్ఠ సినీ అకాడమీ పతాకంపై ప్రభాత్ వర్మ నిర్మించిన చిత్రం ‘శ్రీరామ రక్ష’.

ఈ చిత్రం టీజర్‌ను హీరో సుధీర్‌బాబు, ఓ పాటను సునీల్ విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘తాత- మనవడి బంధం ఇందులో హైలెట్. అన్నివర్గాల ప్రేక్షకులకూ నచ్చేలా తీర్చిదిద్దాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాబూ వర్గీస్, కెమెరా: ఎస్. మురళీమోహన్ రెడ్డి, సహ నిర్మాతలు: గమిడి సత్యం, పి.వి. రంగరాజు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement