Rajit
-
ధమ్కీ ఇవ్వడం పూర్తయింది
రజిత్, త్రిషాలాషా జంటగా ఏనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధమ్కీ’. సత్యనారాయణ సుంకర నిర్మాత. క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు ఏనుగంటి మాట్లాడుతూ – ‘‘ధమ్కీ’ చిత్రం వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే చిత్రమిది. బిత్తిరి సత్తి కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది’’ అన్నారు. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చింది. ఖర్చుకి వెనకాడకుండా ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నించాం. రామ్ లక్ష్మణ్ ఫైట్స్, శ్రీమణి సాహిత్యం, మా సినిమాకు ప్లస్ అవుతాయి అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు కెమెరా: దీపక్ భగవంత్, సంగీతం: ఎసి.బి ఆనంద్. -
వాస్తవ సంఘటనలతో...
అరే మామా వాడెవడో ఎక్స్‌ట్రాలు చేస్తున్నాడురా ధమ్కీ ఇవ్వాలిరా అంటూ ఉంటాం. రజిత్, త్రిషాలాషా జంటగా నటిస్తున్న చిత్రం పేరు ‘ధమ్కీ’. భాస్కరరావు, శ్రీమతి ఆదిలక్ష్మి సమర్పణలో సుంకర బ్రదర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ సుంకర నిర్మాత. ఏనుగంటి దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ఏనుగంటి మాట్లాడుతూ– ‘‘కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ జోనర్లో రూపొందుతోంది. ఆద్యంతం సినిమా అలరిస్తుంది’ అన్నారు. సత్యనారాయణ సుంకర మాట్లాడుతూ– ‘‘ధమ్కీ’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో రిలీజ్ చేస్తాం. సినిమా కథ నచ్చి నిర్మించాను. దర్శకుడు ఏనుగంటి కొన్ని సీన్స్‌ను మెస్మరైజింగ్‌గా తెరకెక్కించారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ౖఫైట్స్: రామ్ లక్ష్మణ్, కెమెరా: ఎసి.బి. ఆనంద్. -
తాత - మనవళ్ల కథ
‘‘శ్రీరామరక్ష’ చిత్రం టీజర్ చూస్తుంటే ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమా చూస్తున్నప్పటి ఫీలింగ్ కలిగింది. టైటిల్ చక్కగా ఉంది. అందుకు తగ్గట్టే చిత్ర యూనిట్‌కు శ్రీరాముని ఆశీస్సులుండాలి’’ అని హీరో సునీల్ అన్నారు. రజిత్, షామిలి, నిషా, విజయ్‌కుమార్, షఫీ, జ్యోతి ముఖ్య పాత్రల్లో రాము దర్శకత్వంలో వశిష్ఠ సినీ అకాడమీ పతాకంపై ప్రభాత్ వర్మ నిర్మించిన చిత్రం ‘శ్రీరామ రక్ష’. ఈ చిత్రం టీజర్‌ను హీరో సుధీర్‌బాబు, ఓ పాటను సునీల్ విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘తాత- మనవడి బంధం ఇందులో హైలెట్. అన్నివర్గాల ప్రేక్షకులకూ నచ్చేలా తీర్చిదిద్దాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాబూ వర్గీస్, కెమెరా: ఎస్. మురళీమోహన్ రెడ్డి, సహ నిర్మాతలు: గమిడి సత్యం, పి.వి. రంగరాజు. -
‘దశమి’ దర్శకుడి చిత్రం
‘దశమి’ వంటి ప్రయోగాత్మక చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్న ఏనుగంటి చిన్నా ఈసారి కూడా మరో వైవిధ్యభరిత చిత్రాన్ని డెరైక్ట్ చేస్తున్నారు. రజిత్, త్రిషాల్ షా జంటగా శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ పతాకంపై శ్రీనివాస చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. సరికొత్త కథాంశంతో పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు. ఈ సినిమాకు కెమెరా: దీపక్ భగవత్, సంగీతం: సుభాష్ ఆనంద్.