రజిత్
అరే మామా వాడెవడో ఎక్స్‌ట్రాలు చేస్తున్నాడురా ధమ్కీ ఇవ్వాలిరా అంటూ ఉంటాం. రజిత్, త్రిషాలాషా జంటగా నటిస్తున్న చిత్రం పేరు ‘ధమ్కీ’. భాస్కరరావు, శ్రీమతి ఆదిలక్ష్మి సమర్పణలో సుంకర బ్రదర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ సుంకర నిర్మాత. ఏనుగంటి దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ఏనుగంటి మాట్లాడుతూ– ‘‘కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను.
క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతోంది. ఆద్యంతం సినిమా అలరిస్తుంది’ అన్నారు. సత్యనారాయణ సుంకర మాట్లాడుతూ– ‘‘ధమ్కీ’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో రిలీజ్ చేస్తాం. సినిమా కథ నచ్చి నిర్మించాను. దర్శకుడు ఏనుగంటి కొన్ని సీన్స్‌ను మెస్మరైజింగ్‌గా తెరకెక్కించారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ౖఫైట్స్: రామ్ లక్ష్మణ్, కెమెరా: ఎసి.బి. ఆనంద్.
Comments
Please login to add a commentAdd a comment