తల్లి, తమ్ముడిని ఇంట్లోంచి గెంటేశాడు.. | the mother protest in front of the son house | Sakshi
Sakshi News home page

తల్లి, తమ్ముడిని ఇంట్లోంచి గెంటేశాడు..

Published Fri, May 27 2016 10:29 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

the mother protest in front of the son house

గూడు కోసం ఓ కుటుంబం రోడ్డెక్కింది. సొంత కుమారుడే ఇంటికి ఆక్రమించి విక్రయించే ప్రయత్నంలో ఉండడంతో కన్నతల్లి, కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం ఆర్టీసీ బస్టాండ్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. వరలక్ష్మమ్మ తన చిన్న కుమారుడు విజయ్‌కుమార్, అతని భార్య సుధామణితో కలసి సొంతింట్లో నివాసం ఉంటోంది.

 

ఆమె రెండో కుమారుడు శంకరనారాయణ విడిగా ఉంటున్నాడు.  శుక్రవారం ఉదయం తల్లి, తమ్ముడు, అతని భార్యను బయటకు గెంటేసిన శంకరనారాయణ ఇంటిని ఆక్రమించుకున్నాడు. శంకరనారాయణ తమను రౌడీలతో బెదిరిస్తున్నాడని, తమ ఇంటిని విక్రయించే ప్రయత్నంలో ఉన్నాడని, న్యాయం చేయాలని కోరుతూ వారు ఇంటి ముందే ధర్నాకు దిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement