Shankaranarayana
-
ఇన్సైడర్ ట్రేడింగ్ బయటపడుతుందనే బాబు భయం
మడకశిర: అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ ఎక్కడ బయటపడుతుందోనని చంద్రబాబు భయపడుతున్నారని, అందుకే రైతులను పావులుగా వాడుకుంటూ నీచ రాజకీయం చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా మడకశిరలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను రెచ్చగొట్టేందుకు చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కూడా తోడయ్యారని దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, టీడీపీ నేతలు, చంద్రబాబు సామాజికవర్గం వారు పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు తెలిపారు. ఈ వ్యవహారం బయటికి రాకుండా చంద్రబాబు రాజధాని రైతులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. రాజధాని రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, అన్ని ప్రాంతాల అభివృద్ధికే సీఎం వైఎస్ జగన్ పాలనా వికేంద్రీకరణ ప్రతిపాదన చేశారని, ప్రస్తుతం రాజధానిపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని, కమిటీ నివేదిక రాకుండానే చంద్రబాబు రాజధానిపై రాద్ధాంతం చేయడం తగదని శంకరనారాయణ హితవుపలికారు. -
బాబు వైఫల్యాలను ఎండగడతాం
8 నుంచి ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ’ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ పెనుకొండ : చంద్రబాబు పాలనా వైఫల్యాలను ఎండగడతామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ తెలిపారు. ఇందు కోసం ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమం చేపడుతామన్నారు. అవినీతిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనన్నారు. ఎన్నికల సమయంలో బెల్టు షాపులు తీసి వేస్తామని ప్రకటించి అధికారం చేపట్టగానే ప్రతి గ్రామంలోనూ అవినీతి దుకాణాలు తెరిచారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై వంద అంశాలతో కూడిన ప్రశ్నావళిని రూపొందించామని, దీనిని ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. సమావేశంలో బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి గుట్టూరు శ్రీరాములు, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది భాస్కరరెడ్డి, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరు బాబు, కన్వీనర్ శ్రీకాంతరెడ్డి, సర్పంచ్ సుధాకరరెడ్డి, సరస్వతమ్మ చంద్రారెడ్డి, రాజ్‌గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీలు రామ్మోహన్‌రెడ్డి, మురళి, అనితా శ్రీనివాసరెడ్డి, పార్టీ బీసీసెల్ జిల్లా నాయకులు కొండలరాయుడు, బోయ నరశింహ, బోయబాబు, జాఫర్, సోమశేఖరరెడ్డి, శంకరరెడ్డి, యాసిన్, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు. -
తల్లి, తమ్ముడిని ఇంట్లోంచి గెంటేశాడు..
గూడు కోసం ఓ కుటుంబం రోడ్డెక్కింది. సొంత కుమారుడే ఇంటికి ఆక్రమించి విక్రయించే ప్రయత్నంలో ఉండడంతో కన్నతల్లి, కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం ఆర్టీసీ బస్టాండ్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. వరలక్ష్మమ్మ తన చిన్న కుమారుడు విజయ్‌కుమార్, అతని భార్య సుధామణితో కలసి సొంతింట్లో నివాసం ఉంటోంది. ఆమె రెండో కుమారుడు శంకరనారాయణ విడిగా ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం తల్లి, తమ్ముడు, అతని భార్యను బయటకు గెంటేసిన శంకరనారాయణ ఇంటిని ఆక్రమించుకున్నాడు. శంకరనారాయణ తమను రౌడీలతో బెదిరిస్తున్నాడని, తమ ఇంటిని విక్రయించే ప్రయత్నంలో ఉన్నాడని, న్యాయం చేయాలని కోరుతూ వారు ఇంటి ముందే ధర్నాకు దిగారు. -
బహుముఖ ప్రజ్ఞాశాలి
బొబ్బిలి: ఆ యువకుడు పేద కుటుంబంలో పుట్టాడు. అం దుకే పేదరికాన్ని జయించాలని కలలు కంటున్నాడు. కష్టా ల మధ్యనే పెరిగాడు. ఇప్పుడు వాటినే విజయానికి వారధులుగా వాడుకోవాలని సూచిస్తున్నాడు. అనేక అవరోధాల ను ఎదుర్కొన్నాడు. ఆ అవరోధాలు దాటినప్పుడే ఆనందం ఉంటుందని గ్రహించి పది మందికీ చెబుతున్నాడు. పేదరికంలో పుట్టినా చదువులో మాత్రం తాను ధనవంతుడినేనని నిరూపించుకుంటూ దూసుకువెళుతున్నాడు కింతలివానిపేట గ్రామానికి చెందిన బొంతలకోటి శంకరనారాయణ. పేదరికంలో పుట్టినా తన ప్రతిభతో నేడు హైదరాబాద్‌లో ఓ వైపు ఉద్యోగం చేస్తూ మరో వైపు సివిల్స్‌కు సిద్ధమవుతున్నాడు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి పోటీలు జరిగినా అక్క డ పాల్గొని తన ప్రతిభను చూపి మన్ననలు పొందుతున్నారు. శంకరనారాయణ తండ్రి జూట్ మిల్లులో కార్మికుడుగా పనిచేస్తుండగా, తల్లి గృహిణిగా ఉంటున్నారు. ఇద్ద రూ నిరక్షరాసుల్యే అయినా బిడ్డను మాత్రం ఉన్నత చదువులు చదివించాలని ఆశ పడుతున్నారు. గ్రామంలోనే ఐదో తరగతి వరకూ ప్రాథమిక విద్యను అభ్యసించిన అనంతరం బొబ్బిలి రాజులు నెలకొల్పిన సంస్థానం పాఠశాలలో 8వ తరగతి వరకూ చదువుకొన్న శంకరరావు ఆ తర్వాత అభ్యుదయ విద్యాసంస్థలో పదో తరగతి పూర్తి చేశాడు. పదో తరగతిలో 546 మార్కులు రావడంతో విశాఖ శ్రీచైతన్య విద్యాసంస్థ ఇంటర్లో చేర్చుకుంది. అక్కడ రెండేళ్లు చదివి 960 మార్కులు సాధించిన అనంతరం విజయనగరం మహారాజా ఇంజినీరింగు కళాశాలలో నాలుగేళ్ల పాటు ఇంజినీరింగు చదివాడు. చదువు అయిన వెంటనే టాటా కన్సల్టెన్సీ సర్వీసు (టీసీఎస్)లో హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉద్యోగం చేస్తూనే మరో వైపు సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. శంకరనారాయణకు చిన్నప్పటి నుంచి పోటీ పరీక్ష లు... సమాజంపై ప్రేమ ఉండడంతో అనేక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాడు. తెలుగు బాషా సేవా సంఘంలో చేరి సామాజిక సేవపై అవగాహన కల్పిస్తున్నాడు. జిల్లా స్థాయిలో పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ బోర్డు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పాల్గొని బహుమతులు కూడా సాధించాడు. అప్పటి నుంచి ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు ఏ పోటీలు నిర్వహించినా వా టిలో పాల్గొంటూ తన ప్రతిభతో బహుమతులు, అవార్డులు, రివార్డులు సాధిస్తున్నాడు. యండమూరి చర్చావేదికలు, టీవీ చర్చా వేదికల్లో పాల్గొని సమాజంపై తనకున్న అభిప్రాయాలను అందరిముందూ పెట్టాడు. కన్యాశుల్కం, దిద్దుబాటు నాటికల్లో నటించడమే కాకుండా వాటిని గ్రామాల్లో ప్రదర్శించి అవగాహన కల్పించాడు కూడా. అలాగే ప్రస్తుతం మా టీవీల్లో ప్రసారమవుతున్న మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో పాల్గొని 6 లక్షల 40 వేల రూపాయలు గెలుచుకున్నాడు. అలాగే అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సం స్థ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన అక్కినేని వ్యక్తిత్వం, జీవితం - యువతరానికి ఓ స్ఫూర్తి సంతకం అనే వ్యాసరచన పోటీల్లో శంకరనారాయణ పాల్గొని రాష్ట్ర స్థాయిలో రెండో బహుమతిని గెలుచుకున్నాడు. ఇప్పుడు ఆ గ్రామానికి, పరిసర ప్రాంతాలకు శంకరనారాయణ ఆదర్శంగా నిలుస్తున్నాడు. శంకరనారాయణ మరింత ఉన్నత స్థాయికి గ్రామస్తులంతా ఆకాంక్షిస్తున్నారు. -
వివాహానికి హాజరైన వైఎస్సార్సీపీ నేతలు
పావగడ: మడకశిరకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు, జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకు ఉపాధ్యక్షుడు ఆనందరంగారెడ్డి కుమార్తె నవ్య,దామోదరరెడ్డి వివాహం గురువారం స్థానిక ఎస్ఎస్కే సముదాయ భవనంలో ఘనంగా జరిగింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, కదిరి ఎమ్మెల్యే అక్తార్ చాంద్ బాషా, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, వైసీ గోవర్ధనరెడ్డి, పాటీల్ వేణుగోపాలరెడ్డి, వైటీ ప్రభాకరరెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, కోనారెడ్డి, ఏపీ కో ఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షుడు శివశంకరరెడ్డి, జీబీ శివకుమార్, చిత్రశేఖర్యాదవ్తోపాటు ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, మునిసిపల్ చైర్మన్ ప్రకాశ్ వధూవరులను ఆశ్వీరదించారు. -
పార్టీ బలోపేతానికి పాటుపడుదాం..
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పెనుకొండ: పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త చిత్తశుద్ధితో సమష్టిగా కృషి చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యకర్తలు, నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే క్రమంలో జిల్లాలో నూతన కమిటీలకు శ్రీకారం చుట్టామన్నారు. మండల కమిటీలనేకాక అనుబంధ విద్యార్థి, యువజన, రైతు, మహిళా విభాగం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇతర కమిటీలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇందులో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వెట్టడించవచ్చునని, తద్వారా వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కమిటీ కన్వీనర్లు ఇతర ప్రముఖ కార్యవర్గ సభ్యులను ఎన్నిక చేస్తారన్నారు. జిల్లా కార్యదర్శిగా సానిపల్లి మహీధర్‌ను ఎంపిక చేయడం జరిగిందని ఆయన పేరును రాష్ట్ర కమిటీకి పంపుతామన్నారు. ప్రస్తుత మండల కన్వీనర్‌గా వున్న నీరగంటి వెంకటరాముడుకు జిల్లా కమిటీలో చోటు కల్పిస్తున్నట్లు తెలిపారు. కమిటీల్లో అధ్యక్షునిత పాటు,ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, ఐదుగురు కార్యదర్శులు, 10 మంది సహాయ కార్యదర్శులు కోశాదికారి ఇతర కార్యవర్గ సభ్యులు వుంటారన్నారు. సమావేశంలో సమన్వయ కర్త సానిపల్లి మంగమ్మ, రామ్మోహన్‌రెడ్డి, గుట్టూరుశ్రీరాములు, మార్కెట్ మాజీ చైర్మన్ నాగలూరుబా బు, నీరగంటి వెంకటరాముడు, సర్పంచ్ శ్రీకాంతరెడ్డి, వెంకటరామిరెడ్డి, సుధాకరరెడ్డి. చలపతి, ఎంపీటీసీ ఉ మర్ఫారూక్, రహంతుల్లా, శంకరరెడ్డి, మహీధర్, యస్ బీ శీనా, బాబు, టౌన్యూత్ కన్వీనర్ శ్రీరాములు, ఇర్షా ద్, గౌస్‌లాజం, బోయ నరశింహులు, చంద్రశేఖరరెడ్డి, రహంతుల్లా, కదీర్బాష, రియాజ్, ఇలియాజ్, మునిమడుగు శ్రీనివాసులు, జబ్బార్, మున్వర్, కొండలరాయు డు, శ్యాం, నాగముత్తయ్య, రామంచంద్రారెడ్డి, ఖాజాపీ రా, రాంపురం ఈశ్వర్, సోమశేఖరరెడ్డి, సుశీలమ్మ, చంద్రాబాయి, హెప్సీబా, నాయుడు, రత్నాలు, వెంకటేశు లు, శ్రీనివాసరెడ్డి, పూజిరెడ్డి పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఎంపీల అవిశ్వాసం నోటీస్ ఓ డ్రామా
= వారికి సమైక్యాంధ్రపై చిత్తశుద్ధి లేదు = చంద్రబాబుతో లగడపాటి, జేసీ కుమ్మక్కు = వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ధ్వజం మడకశిర, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర విషయంలో కాంగ్రెస్ ఎంపీలు డ్రామాలాడుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మడకశిరలోని మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి స్వగృహంలో విలేకర్లతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రజల్లో హీరోలు కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాసం నోటీసు ఇచ్చారని, అయితే వారికి సమైక్యాంధ్రపై ఏమాత్రమూ చిత్తశుద్ధి లేదని విమర్శించారు. చిత్తశుద్ధి ఉండివుంటే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించి, ఎందుకు ఆమోదింప జేసుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబుతో లగడపాటి రాజగోపాల్, జేసీ దివాకర్‌రెడ్డి కుమ్మక్కై జగన్‌పై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎంపీ టికెట్ల కోసమే వారు చంద్రబాబుతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. టీడీపీ సీమాంధ్ర ఎంపీలు, ప్రజాప్రతినిధులు కూడా సమైక్యాంధ్రపై నాటకాలు ఆడుతున్నట్లు దుయ్యబట్టారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జాతీయ స్థాయిలో పాటుపడుతున్నట్లు చెప్పారు. జగన్ ప్రయత్నాన్ని సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు హర్షించకుండా విమర్శలు చేయడం దారుణమన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్న విషయం తెలిసికూడా ముఖ్యమంత్రి, సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు పట్టించుకోలేదని విమర్శించారు. 16న మడకశిరలో సమైక్య శంఖారావం సభ మడకశిరలోని వైఎస్సార్‌సర్కిల్‌లో ఈ నెల 16న ఉదయం పది గంటలకు సమైక్యశంఖారావం సభను నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికారప్రతినిధి వైసీ గోవర్దన్‌రెడ్డి తెలిపారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి హాజరవుతారన్నారు. అలాగే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ముఖ్య నేతలు విశ్వేశ్వరరెడ్డి, తోపుదుర్తి కవిత తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు.