బహుముఖ ప్రజ్ఞాశాలి | 6 lakh 40 thousand won Shankaranarayana in Meelo Evaru Koteeshwarudu program | Sakshi
Sakshi News home page

బహుముఖ ప్రజ్ఞాశాలి

Published Fri, Dec 26 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM

బహుముఖ ప్రజ్ఞాశాలి

బహుముఖ ప్రజ్ఞాశాలి

బొబ్బిలి: ఆ యువకుడు పేద కుటుంబంలో పుట్టాడు. అం దుకే పేదరికాన్ని జయించాలని కలలు కంటున్నాడు. కష్టా ల మధ్యనే పెరిగాడు. ఇప్పుడు వాటినే విజయానికి వారధులుగా వాడుకోవాలని సూచిస్తున్నాడు. అనేక అవరోధాల ను ఎదుర్కొన్నాడు. ఆ అవరోధాలు దాటినప్పుడే ఆనందం ఉంటుందని గ్రహించి పది మందికీ చెబుతున్నాడు. పేదరికంలో పుట్టినా చదువులో మాత్రం తాను ధనవంతుడినేనని నిరూపించుకుంటూ దూసుకువెళుతున్నాడు కింతలివానిపేట గ్రామానికి చెందిన బొంతలకోటి శంకరనారాయణ. పేదరికంలో పుట్టినా తన ప్రతిభతో నేడు హైదరాబాద్‌లో ఓ వైపు ఉద్యోగం చేస్తూ మరో వైపు సివిల్స్‌కు సిద్ధమవుతున్నాడు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి పోటీలు జరిగినా అక్క డ పాల్గొని తన ప్రతిభను చూపి మన్ననలు పొందుతున్నారు.
 
 శంకరనారాయణ తండ్రి జూట్ మిల్లులో కార్మికుడుగా పనిచేస్తుండగా, తల్లి గృహిణిగా ఉంటున్నారు. ఇద్ద రూ నిరక్షరాసుల్యే అయినా బిడ్డను మాత్రం ఉన్నత చదువులు చదివించాలని ఆశ పడుతున్నారు. గ్రామంలోనే ఐదో తరగతి వరకూ ప్రాథమిక విద్యను అభ్యసించిన అనంతరం బొబ్బిలి రాజులు నెలకొల్పిన సంస్థానం పాఠశాలలో 8వ తరగతి వరకూ చదువుకొన్న శంకరరావు ఆ తర్వాత అభ్యుదయ విద్యాసంస్థలో పదో తరగతి పూర్తి చేశాడు. పదో తరగతిలో 546 మార్కులు రావడంతో విశాఖ శ్రీచైతన్య విద్యాసంస్థ ఇంటర్‌లో చేర్చుకుంది. అక్కడ రెండేళ్లు చదివి 960 మార్కులు సాధించిన అనంతరం విజయనగరం మహారాజా ఇంజినీరింగు కళాశాలలో నాలుగేళ్ల పాటు ఇంజినీరింగు చదివాడు. చదువు అయిన వెంటనే టాటా కన్సల్టెన్సీ సర్వీసు (టీసీఎస్)లో హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉద్యోగం చేస్తూనే మరో వైపు సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు.
 
 శంకరనారాయణకు చిన్నప్పటి నుంచి పోటీ పరీక్ష లు... సమాజంపై ప్రేమ ఉండడంతో అనేక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాడు. తెలుగు బాషా సేవా సంఘంలో చేరి సామాజిక సేవపై అవగాహన కల్పిస్తున్నాడు. జిల్లా స్థాయిలో పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ బోర్డు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పాల్గొని బహుమతులు కూడా సాధించాడు. అప్పటి నుంచి ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు ఏ పోటీలు నిర్వహించినా వా టిలో పాల్గొంటూ తన ప్రతిభతో బహుమతులు, అవార్డులు, రివార్డులు సాధిస్తున్నాడు. యండమూరి చర్చావేదికలు, టీవీ చర్చా వేదికల్లో పాల్గొని సమాజంపై తనకున్న అభిప్రాయాలను అందరిముందూ పెట్టాడు.
 
  కన్యాశుల్కం, దిద్దుబాటు నాటికల్లో నటించడమే కాకుండా వాటిని గ్రామాల్లో ప్రదర్శించి అవగాహన కల్పించాడు కూడా. అలాగే ప్రస్తుతం మా టీవీల్లో ప్రసారమవుతున్న మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో పాల్గొని 6 లక్షల 40 వేల రూపాయలు గెలుచుకున్నాడు. అలాగే అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సం స్థ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన అక్కినేని వ్యక్తిత్వం, జీవితం - యువతరానికి ఓ స్ఫూర్తి సంతకం అనే వ్యాసరచన పోటీల్లో శంకరనారాయణ పాల్గొని రాష్ట్ర స్థాయిలో రెండో బహుమతిని గెలుచుకున్నాడు. ఇప్పుడు ఆ గ్రామానికి, పరిసర ప్రాంతాలకు శంకరనారాయణ ఆదర్శంగా నిలుస్తున్నాడు.  శంకరనారాయణ మరింత ఉన్నత స్థాయికి గ్రామస్తులంతా ఆకాంక్షిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement