బాబు వైఫల్యాలను ఎండగడతాం | ysrcp leaders fire on ap cm chandra babu | Sakshi
Sakshi News home page

బాబు వైఫల్యాలను ఎండగడతాం

Published Wed, Jul 6 2016 4:02 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

ysrcp leaders fire on ap cm chandra babu

8 నుంచి ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ’
జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ

 
పెనుకొండ : చంద్రబాబు పాలనా వైఫల్యాలను ఎండగడతామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ తెలిపారు. ఇందు కోసం ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి గడపగడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమం చేపడుతామన్నారు. అవినీతిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనన్నారు. ఎన్నికల సమయంలో బెల్టు షాపులు తీసి వేస్తామని ప్రకటించి అధికారం చేపట్టగానే ప్రతి గ్రామంలోనూ అవినీతి దుకాణాలు తెరిచారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై వంద అంశాలతో కూడిన ప్రశ్నావళిని రూపొందించామని, దీనిని ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు.  సమావేశంలో బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి గుట్టూరు శ్రీరాములు, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది భాస్కరరెడ్డి, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరు బాబు, కన్వీనర్ శ్రీకాంతరెడ్డి, సర్పంచ్ సుధాకరరెడ్డి, సరస్వతమ్మ చంద్రారెడ్డి, రాజ్‌గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీలు రామ్మోహన్‌రెడ్డి, మురళి, అనితా శ్రీనివాసరెడ్డి, పార్టీ బీసీసెల్ జిల్లా నాయకులు కొండలరాయుడు, బోయ నరశింహ, బోయబాబు, జాఫర్, సోమశేఖరరెడ్డి, శంకరరెడ్డి, యాసిన్, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement