పార్టీ బలోపేతానికి పాటుపడుదాం.. | Patupadudam to strengthen the party .. | Sakshi
Sakshi News home page

పార్టీ బలోపేతానికి పాటుపడుదాం..

Published Thu, Nov 20 2014 2:28 AM | Last Updated on Fri, Mar 22 2019 6:24 PM

పార్టీ బలోపేతానికి పాటుపడుదాం.. - Sakshi

పార్టీ బలోపేతానికి పాటుపడుదాం..

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ
 
పెనుకొండ: పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త చిత్తశుద్ధితో సమష్టిగా కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యకర్తలు, నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే క్రమంలో జిల్లాలో నూతన కమిటీలకు శ్రీకారం చుట్టామన్నారు.   

మండల కమిటీలనేకాక అనుబంధ  విద్యార్థి, యువజన,  రైతు, మహిళా విభాగం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇతర కమిటీలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇందులో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు.  ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వెట్టడించవచ్చునని, తద్వారా వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కమిటీ కన్వీనర్లు ఇతర ప్రముఖ కార్యవర్గ సభ్యులను ఎన్నిక చేస్తారన్నారు.  

జిల్లా కార్యదర్శిగా సానిపల్లి మహీధర్‌ను ఎంపిక చేయడం జరిగిందని ఆయన పేరును రాష్ట్ర కమిటీకి పంపుతామన్నారు.  ప్రస్తుత  మండల కన్వీనర్‌గా  వున్న నీరగంటి వెంకటరాముడుకు జిల్లా కమిటీలో చోటు కల్పిస్తున్నట్లు  తెలిపారు.  కమిటీల్లో అధ్యక్షునిత పాటు,ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, ఐదుగురు కార్యదర్శులు, 10 మంది సహాయ కార్యదర్శులు కోశాదికారి ఇతర కార్యవర్గ సభ్యులు వుంటారన్నారు.

సమావేశంలో సమన్వయ కర్త సానిపల్లి మంగమ్మ, రామ్మోహన్‌రెడ్డి, గుట్టూరుశ్రీరాములు, మార్కెట్ మాజీ చైర్మన్ నాగలూరుబా బు,  నీరగంటి వెంకటరాముడు,  సర్పంచ్ శ్రీకాంతరెడ్డి, వెంకటరామిరెడ్డి, సుధాకరరెడ్డి. చలపతి,  ఎంపీటీసీ ఉ మర్ఫారూక్, రహంతుల్లా, శంకరరెడ్డి, మహీధర్,  యస్ బీ శీనా, బాబు, టౌన్‌యూత్ కన్వీనర్ శ్రీరాములు, ఇర్షా ద్, గౌస్‌లాజం, బోయ నరశింహులు, చంద్రశేఖరరెడ్డి, రహంతుల్లా, కదీర్‌బాష, రియాజ్, ఇలియాజ్, మునిమడుగు శ్రీనివాసులు, జబ్బార్, మున్వర్, కొండలరాయు డు, శ్యాం, నాగముత్తయ్య, రామంచంద్రారెడ్డి, ఖాజాపీ రా, రాంపురం ఈశ్వర్, సోమశేఖరరెడ్డి, సుశీలమ్మ, చంద్రాబాయి, హెప్సీబా, నాయుడు, రత్నాలు, వెంకటేశు లు, శ్రీనివాసరెడ్డి, పూజిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement