లిబియాలో ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న నగరానికి చెందిన ఇద్దరు లెక్చరర్లను ఇంకా విడుదల చేయకపోవడంపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఉగ్రవాదుల చెరలోనే తెలుగు లెక్చరర్లు
సాక్షి, హైదరాబాద్: లిబియాలో ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న నగరానికి చెందిన ఇద్దరు లెక్చరర్లను ఇంకా విడుదల చేయకపోవడంపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అల్వాల్‌కు చెందిన బలరాం, నాచారానికి చెందిన గోపీకృష్ణ ఉగ్రవాదుల చేతికి చిక్కి వారం రోజులు కావస్తున్నా, ఇప్పటికీ విడిచిపెట్టకపోవడంపై వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చెందిన లక్ష్మీకాంత్, అదే రాష్ట్రానికి చెందిన విజయ్ కుమార్ విడుదలైనా, ఇప్పటివరకు తమవారిని వదిలిపెట్టకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సాధ్యమైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వం తమ వారిని సురక్షితంగా తీసుకురావడానికి ప్రయత్నించాలని వేడుకుంటున్నారు.