హలో.. బ్రదర్.. మీ నంబరుకు సామ్‌సంగ్ జే7 మొబైల్ ఆఫర్ వచ్చింది....
మొబైల్ ఆఫర్ పేరుతో మోసం
పార్శిల్‌లో సెల్‌కు బదులు యంత్రం, తాబేలుబొమ్మ
రామసముద్రం, పుంగనూరులో జనం బెంబేలు
హలో.. బ్రదర్.. మీ నంబరుకు సామ్‌సంగ్ జే7 మొబైల్ ఆఫర్ వచ్చింది.. రూ.14 వేలు విలువ చేసే మొబైల్‌ను కేవలం రూ.3450కే ఇస్తాం. తీసుకోండి.. అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. రెండు, మూడు రోజుల్లో పోస్టాఫీసు ద్వారా పార్శిల్ వస్తుంది.. డబ్బు కట్టి తీసుకోండి.. అంటూ పెట్టేశాడు. పోస్టాఫీసులో రూ.3450 చెల్లించి పార్శిల్ తెరిచి చూడగా అందులో లక్ష్మీయంత్రం, తాబేలు బొమ్మ ఉండడంతో బాధితుడు అవాక్కయ్యాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ మోసం రామసముద్రం, పుంగనూరులో సంచలనం కలిగించింది.
రామసముద్రం: ఆన్‌లైన్‌లో.. వివిధ రకాల ఆఫర్లు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లంటూ ఊరించి.. చివరికి ముంచేసే కేటుగాళ్ల మోసం మరోమారు వెలుగు చూసింది. రామసముద్రం మండలం ఎలకపల్లె గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో విజయ్‌కుమార్ (సెల్ నంబరు 9000079948)కు ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నామంటూ 919311755628 నంబరుతో ఫోన్ వచ్చింది. రీసీవ్ చేసి మాట్లాడగా మీ మొబైల్ నంబరుకు బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పడంతో తమకు వద్దంటూ నిరాకరించాడు. అయినప్పటికీ పదేపదే ఫోన్లు చేస్తూ ఒత్తిడి తేవడంతో తమ వద్ద డబ్బులు లేవని తిర స్కరించినా పార్శిల్ వచ్చిన తరువాతే పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఓపెన్‌చేసి చూడండని నమ్మబలికాడు. నమ్మకంతో విజయ్‌కుమార్ కొద్దిరోజుల కిందంట తన అడ్రస్‌పై పార్శిల్ రావడంతో రూ.3450 చెల్లించి పార్శిల్‌ను తీసుకుని ఓపెన్‌చేయగా అందులో మొబైల్‌కు బదులుగా లక్ష్మీయంత్రం, తాబేలు బొమ్మ ఉండడంతో అవక్కాయ్యాడు. ఢిల్లీ నుంచి వచ్చిన నంబర్‌కు విజయ్ ఫోన్‌చేసి తనను మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో వారు సరైన సమాధానం చెప్పలేదు. విషయాన్ని పోలీసులకు కూడా విన్నవించాడు. అనంతరం ఢిల్లీ నంబర్ నుంచి ఫోన్‌చేసి పార్శిల్ మారిపోయిందని రెండు రోజుల్లో మొబైల్ ఉన్న పార్శిల్ పంపుతామన్న మోసగాడు ఇంత వరకు పంపలేదు. దీంతో లక్ష్మీయంత్రాన్ని ఇంటికి తీసుకెళ్లాలా వద్దా అనే సంది గ్దంలో విజయ్‌కుమార్ వేరొక్కరి ఇంట్లో ఉంచాడు.
పుంగనూరులోనూ..
పుంగనూరు పట్టణంలోని గోకుల్‌వీధిలో రవికుమార్ , ఆయన సతీమణి ప్రీతి ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు. పది రోజుల క్రితం రాకేష్ అనే వ్యక్తి ప్రీతి (నంబరు : 7093199219)కి ఫోన్ చేసి మీకు కంపెనీ ఆఫర్‌లో సెల్‌ఫోన్ వచ్చింది రూ.3500లు చెల్లించి ఫోస్టాఫీసు ద్వారా పార్శిల్ తీసుకోండంటూ సమాచారం ఇచ్చాడు. సోమవారం ఉదయం 10 గంటలకు రాకేష్ తిరిగి ఫోన్ చేసి పోస్టాఫీసుకి పార్శిల్ చేరుకుందని వెంటనే వెళ్లాలని చెప్పాడు. ప్రీతి భర్త రవికుమార్ ఫోస్టాపీసుకు వెళ్లి పార్శిల్ తీసుకుని ఓపెన్ చేయడంతో నివ్వెరపోయాడు. సెల్‌ఫోన్ బదులుగా చిన్న గాయత్రి యంత్రం పంపడంతో మోసపోయామని గుర్తించి పోస్టుమాస్టర్‌కు రిపో ర్ట్ చేశారు. ఇలాంటి పార్శిళ్లు ఒకే రోజు 15 వరకు వచ్చినట్లు సమాచారం. పోలీసులు ఇలాంటి మోసగాళ్లపై చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.