సాక్షి, విజయవాడ: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రజాభిప్రాయసేకరణ గడువు గురువారంతో ముగియనున్నట్లు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇప్పటి వరకు 7,500 సలహాలు కలెక్టర్లకు అందజేశారు. ఒక్క విజయనగరం జిల్లా నుంచే 4,500 సలహాలు, సూచనలు వచ్చాయి.
తర్వాత అధికంగా కృష్ణా జిల్లా నుంచి సూచనలు అందాయి. అన్నిజిల్లాల సమీక్షలు ఈ రోజుతో ముగిశాయి. వీటన్నిటిని పరిశీలించి, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద తుది నిర్ణయం జరుగుతుంది. మార్చి నెలాఖరులోపు తుది నోటిఫికేషన్ ఇస్తాం. కొత్త జిల్లాలకు అధికారులు, ఉద్యోగుల విభజన పూర్తి చేస్తాం. మొత్తం 60 అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు వచ్చాయని' ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు.
చదవండి: (ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment