అనంతపురం సెంట్రల్ : బెటాలియన్ రేంజ్ –3 డీఐజీ విజయకుమార్ సోమవారం జిల్లాకు వచ్చారు. పీటీసీలోని 14వ బెటాలియన్ కార్యాలయం తనిఖీ నిమిత్తం ఆయన రెండు రోజుల పర్యటనకు వచ్చారు. తొలుత బెటాలియన్ కమాండెంట్ జగదీష్‌కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం బెటాలియన్ సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. మంగళవారం కార్యాలయ సిబ్బందితో సమావేశం, పలు రికార్డుల పరిశీలన ఉంటుందని బెటాలియన్ అధికార వర్గాలు తెలిపాయి.