came to anantapur
-
‘అనంత’కు చేరిన కృష్ణాజలాలు
వజ్రకరూరు/గుంతకల్లు: కృష్ణా జలాలు జిల్లాలోకి ప్రవేశించాయి. మూడు రోజుల క్రితం కర్నూలు జిల్లా మాల్యాల ఎత్తిపోతల పథకం నుంచి అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా కాలువకు నీటిని వదిలారు. మంగళవారం తెల్లవారుజామున 3.00 గంటలకు అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతంలోని 144వ కీమీ వద్ద కసాపురం గ్రామం వద్దకు ప్రవేశించాయి. దీంతో గుంతకల్లు పట్టణ వాసుల దాహార్తిని తీర్చే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేయనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. మరోవైపు మంగళవారం ఉదయానికి కృష్ణా జలాలు రాగులపాడు లిఫ్ట్ వద్దకు చేరుకోగానే అధికారులు జీడిపల్లి రిజర్వాయర్‌కు నీటిని పంప్ చేస్తున్నారు. ఉదయం ఒక పంపు ద్వారా పంపింగ్ ప్రారంభించారు. కృష్ణా జలాలు హంద్రీనీవా ప్రధాన కాలువలోకి వస్తుండడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరుగుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాగులపాడుకు వచ్చే నీటిని బట్టి పంపుల సంఖ్య పెంచుతామని లిఫ్ట్ ఇన్చార్జ్ వెంకటరాజు ‘సాక్షి’కి తెలిపారు. -
రేపు అనంతకు రానున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : న్యూజిలాండ్ జూనియర్ క్రికెట్ జట్టు ఈనెల 8న అనంతపురానికి రానున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి కేఎస్ షాహబుద్దీన్ తెలిపారు. స్థానిక అనంత క్రీడామైదానంలో అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టుతో న్యూజిలాండ్ వన్డే మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 8 నుంచి 13వ తేది వరకు న్యూజిలాండ్ జూనియర్స్ జట్టు అనంతపురం జట్టుతో తలపడుతుందన్నారు. 20 నుంచి 27వ తేది వరకు న్యూజిలాండ్ సీనియర్స్ జట్టు కూడా పర్యటిస్తుందని తెలిపారు. ఇప్పటికే న్యూజిలాండ్ క్రికెట్ జట్టు అక్కడి నుంచి బయలు దేరిందని చెప్పారు. వారు శుక్రవారం నగరానికి చేరుకుంటారన్నారు. స్థానిక ఆర్డీటీ క్రీడా మైదానంలోనే వారు బస చేస్తారని పేర్కొన్నారు. -
రేపు మంత్రి కామినేని రాక
అనంతపురం అర్బన్ : ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ నెల 23న జిల్లాకు విచ్చేస్తున్నారు. ఉదయం 9.45 గంటలకు హిందూపురం చేరుకుని ఎంసీహెచ్ భవనం ప్రారంభిస్తారు. అనంతరం ధర్మవరంలోని ముదిగుబ్బ మండలం మొలకవేములకు మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకుని పీహెచ్సీ భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. సాయంత్రం 4 గంటలకు తాడిమర్రికి చేరుకుని మండలం కేంద్రంలో పీహెచ్‌జీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడి నుంచి బెంగుళూరుకి వెళ్తారు. -
24న డీజీపీ సాంబశివరావు రాక
అనంతపురం సెంట్రల్ : రాష్ట్ర పోలీస్‌బాస్(డీజీపీ) సాంబశివరావు ఈనెల 24న జిల్లాకు వస్తున్నారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి జిల్లాకు వస్తున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు హయాంలో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ముఖ్యంగా కోర్టురోడ్డులో నిర్మించిన పెట్రోల్‌బంక్‌ను డీజీపీ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో పోలీసుల ఆధ్వర్యంలో పెట్రోల్‌బంక్‌లు నిర్వహించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో దీన్ని నిర్మించారు. కనుక డీజీపీ చేతులు మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు. 25,26 తేదీల్లో ఎస్పీ రాజశేఖరబాబు రిలీవ్ : డీజీపీ సాంబశివరావు జిల్లా పర్యటన ముగిసిన తర్వాతే ఎస్పీ రాజశేఖరబాబు రిలీవ్, నూతన ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాలు ఉంటాయని పోలీసువర్గాలు వెల్లడించాయి. జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు చిత్తూరుకు, విజయవాడ డీసీపీ అశోక్‌కుమార్‌ను జిల్లాకు నియమించిన విషయం విదితమే. -
9న జిల్లాకు సీఎం చంద్రబాబు
అనంతపురం అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 9న జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా పర్యటన షెడ్యూల్ గురువారం విడుదల కానుంది. ఈ నెల 9న ప్రభుత్వం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, ఈ కార్యక్రమాన్ని రాయదుర్గం నియోజకవర్గంలో సీఎం ప్రారంభిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. అంతే కాకుండా ఇటీవల ప్రకటించిన ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి చెక్‌ను ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో సీఎం విడుదల చేస్తారని తెలుస్తోంది. సీఎం పర్యటన ఖరారు కావడంతో ఏరువాక కార్యక్రమ నిర్వహణకు స్థల ఎంపిక, బహిరంగ సభ ఏర్పాట్లపై జిల్లా యంత్రాగం బుధవారం సాయంత్రం రాయదుర్గంలో పర్యటించింది. -
రేపు సీఎం రాక!
అనంతపురం అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20న జిల్లా పర్యటనకు వస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. మొదట ఆయన పుట్టపర్తికి విచ్చేస్తారని సమాచారం. అక్కడి నుంచి హెలికాప్టర్లో పామిడి మండలం గజరాంపల్లికి చేరుకుని క్షేత్ర స్థాయి పర్యటన చేస్తారని, ఆ తర్వాత పామిడి జూనియర్ కళాశాలలో బహిరంగ సభ ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. -
బెటాలియన్ డీఐజీ జిల్లాకు రాక
అనంతపురం సెంట్రల్ : బెటాలియన్ రేంజ్ –3 డీఐజీ విజయకుమార్ సోమవారం జిల్లాకు వచ్చారు. పీటీసీలోని 14వ బెటాలియన్ కార్యాలయం తనిఖీ నిమిత్తం ఆయన రెండు రోజుల పర్యటనకు వచ్చారు. తొలుత బెటాలియన్ కమాండెంట్ జగదీష్‌కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం బెటాలియన్ సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. మంగళవారం కార్యాలయ సిబ్బందితో సమావేశం, పలు రికార్డుల పరిశీలన ఉంటుందని బెటాలియన్ అధికార వర్గాలు తెలిపాయి. -
26న కేంద్ర కరువు బృందం జిల్లాకు రాక
కదిరి : జిల్లాలో కరవు పరిస్థితులను అధ్యయనం చేయడానికి కేంద్ర, రాష్ట్ర మంత్రుల బృందం ఈ నెల 26న జిల్లాకు రానున్నట్లు బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సోమగుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల వాసులు బెంగుళూరు, కేరళ లాంటి చోట్లకు వలసలు వెళ్లారని, వీటన్నింటిపై ఆ బృందం అధ్యయనం చేస్తుందని చెప్పారు. వలసలను నివారించడం కోసం పని దినాలను 150 రోజులకు పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి చట్టబద్దత కూడా కల్పించామన్నారు. ఇక ప్రత్యేక హోదాపై మాట్లాడటం దండగ..అన్నారు. అందరికీ ఇల్లు పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 2 లక్షల ఇళ్లు మంజూరు చేసిందనీ, అయితే సంబంధిత అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఆ నిధులు వాపసు వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. ఇందుకు బా«ధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలుపుల గంగాధర్, నృసింహాలయ కమిటీ సభ్యులు తేపల్లి రామక్రిష్ణ, పార్టీ జిల్లా కార్యదర్శి డీఎల్ ఆంజనేయులు, పట్టణ కార్యదర్శి జెట్టి ఆంజనేయులు, నాగేంద్ర పాల్గొన్నారు. -
11న సురవరం సుధాకర్‌రెడ్డి రాక
అనంతపురం అర్బన్ : తరిమెల నాగిరెడ్డి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఈ నెల 11న జిల్లాకు విచ్చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు సాయంత్రం స్థానిక బ్రహ్మంగారి కల్యాణమంటపంలో ఉదయం 11 గంటలకు పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశం, మధ్యాహ్నం జిల్లా కౌన్సిల్ సమావేశం ఉంటుందని తెలిపారు. సమావేశాలకు 14 నియోజవర్గాల క్రియాశీల, జిల్లా సమితి సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని తెలియజేశారు. -
నేడు కాపు కార్పొరేషన్ చైర్మన్ రాక
అనంతపురం అర్బన్ : కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమల చెట్టి రామానుజయ శనివారం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నట్లు సంబంధిత కార్పొరేషన్ ఈడీ నాగముని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న కాపుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొంటారని తెలిపారు. -
రేపు మంత్రి రావెల రాక
అనంతపురం అర్బన్ : జిల్లాలో చేపట్టిన ‘చంద్రన్న దళిత బాట’ కార్యక్రమంలో పాల్గొనేందుకు సాంఘిక, గిరిజన సంక్షేమ సాధికారత శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు సోమవారం జిల్లాకు విచ్చేస్తున్నారు. సంక్షేమ పథకాలపై ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు, ప్రజ లకు ఆవగాహన కల్పించేందుకు మధ్యాహ్న ం మూడు గంటలకు ఆర్ట్ కళాశాల ఎదురుగా ఉన్న మైదానంలో సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రోశన్న ఒక ప్రకటనలో తెలిపారు. సదస్సుకు జిల్లాలోని దళిత, గిరిజన సామాజిక వర్గాల ప్రజలు, సంఘాల నాయకులు హాజరు కావాలని ఆయన కోరారు.