9న జిల్లాకు సీఎం చంద్రబాబు | cm came to anantapur on 9th | Sakshi
Sakshi News home page

9న జిల్లాకు సీఎం చంద్రబాబు

Published Wed, Jun 7 2017 10:50 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

cm came to anantapur on 9th

అనంతపురం అర్బన్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 9న జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా పర్యటన షెడ్యూల్‌ గురువారం విడుదల కానుంది. ఈ నెల 9న ప్రభుత్వం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, ఈ కార్యక్రమాన్ని రాయదుర్గం నియోజకవర్గంలో సీఎం ప్రారంభిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. అంతే కాకుండా ఇటీవల ప్రకటించిన ఇన్‌పుట్‌ సబ్సిడీకి సంబంధించి చెక్‌ను ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో సీఎం విడుదల చేస్తారని తెలుస్తోంది. సీఎం పర్యటన ఖరారు కావడంతో ఏరువాక కార్యక్రమ నిర్వహణకు స్థల ఎంపిక, బహిరంగ సభ ఏర్పాట్లపై జిల్లా యంత్రాగం బుధవారం సాయంత్రం రాయదుర్గంలో పర్యటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement