అనంతపురం అర్బన్ : తరిమెల నాగిరెడ్డి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఈ నెల 11న జిల్లాకు విచ్చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు సాయంత్రం స్థానిక బ్రహ్మంగారి కల్యాణమంటపంలో ఉదయం 11 గంటలకు పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశం, మధ్యాహ్నం జిల్లా కౌన్సిల్ సమావేశం ఉంటుందని తెలిపారు. సమావేశాలకు 14 నియోజవర్గాల క్రియాశీల, జిల్లా సమితి సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని తెలియజేశారు.