అనంతపురం సెంట్రల్ : రాష్ట్ర పోలీస్‌బాస్(డీజీపీ) సాంబశివరావు ఈనెల 24న జిల్లాకు వస్తున్నారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి జిల్లాకు వస్తున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు హయాంలో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ముఖ్యంగా కోర్టురోడ్డులో నిర్మించిన పెట్రోల్‌బంక్‌ను డీజీపీ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో పోలీసుల ఆధ్వర్యంలో పెట్రోల్‌బంక్‌లు నిర్వహించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో దీన్ని నిర్మించారు. కనుక డీజీపీ చేతులు మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు.
25,26 తేదీల్లో ఎస్పీ రాజశేఖరబాబు రిలీవ్ : డీజీపీ సాంబశివరావు జిల్లా పర్యటన ముగిసిన తర్వాతే ఎస్పీ రాజశేఖరబాబు రిలీవ్, నూతన ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాలు ఉంటాయని పోలీసువర్గాలు వెల్లడించాయి. జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు చిత్తూరుకు, విజయవాడ డీసీపీ అశోక్‌కుమార్‌ను జిల్లాకు నియమించిన విషయం విదితమే.
24న డీజీపీ సాంబశివరావు రాక
Published Wed, Jun 21 2017 10:45 PM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM
Advertisement
Advertisement