విజయ్కుమార్ ఇంటిపై ఏసీబీ దాడి | ACB Raids On Kukatpally tax inspector House | Sakshi
Sakshi News home page

విజయ్కుమార్ ఇంటిపై ఏసీబీ దాడి

Published Tue, May 10 2016 8:32 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB Raids On Kukatpally tax inspector House

కూకట్పల్లి ట్యాక్స్ ఇన్స్పెక్టర్ విజయ్కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేశారు.

హైదరాబాద్ : కూకట్పల్లిలోని జీహెచ్ఎంసీ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ విజయ్కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేశారు. ఈ దాడిలో సుమారు రూ. ఐదు కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. మియాపూర్ మక్తలోని విజయ్కుమార్కు చెందిన రెండు ఇళ్లతోపాటు, మరో నాలుగు ప్రాంతాల్లోని అతడి బంధువుల ఇళ్లపై  ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

ఈ సోదాల్లో విజయ్కుమార్కు చెందిన రెండు ఖరీదైన ఇళ్లతోపాటు రెండు కార్లు, 60 తులాల బంగారం, రూ. 50 లక్షల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, పటాన్చెరువు, యాదగిరిగుట్టలోని ఖాళీ స్థలాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ ఆస్తుల విలువ రూ. 1.5 కోట్లు ఉంటుందని... అదే బహిరంగ మార్కెట్లో రూ 5 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement