మేజర్ గ్రామ పంచాయతీ వెల్దుర్తిలో ఆలస్యంగా బయటపడంతో డీఎల్‌పీఓ విజయ్‌కుమార్ విచారణకు ఆదేశించారు.
కర్నూలు(వెల్దుర్తి): మేజర్ గ్రామ పంచాయతీ వెల్దుర్తిలో ఆలస్యంగా బయటపడంతో డీఎల్‌పీఓ విజయ్‌కుమార్ విచారణకు ఆదేశించారు. 2000 సంవత్సరం వరకు జననానికి సంబందించిన వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకొని సంబంధితులకు ఆమోద పత్రాన్ని అధికారులు అందజేసేవారు. అయితే రిజిస్టర్‌లో జనన నమోదుల్లో కొందరి అధికారులు మామూళ్లకు మొగ్గుచూపడంతో నిబందనలకు విరుద్ధంగా జననాలను నమోదు చేశారు. ఈ విషయంలో ఆలస్యంగా బయటికి పొక్కడంతో బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించారు.
అసలు ఏం జరిగింది
స్థానిక రెడ్డివీధిలో నివాసం ఉంటున్న గోపాల్‌రెడ్డి కుమారుడు జనార్దన్‌రెడ్డి బీటెక్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 1994 సంవత్సరం నవంబర్ నెలకు సంబందించిన జనన సర్టిఫికేట్‌కోసం పంచాయతీ అధికారులను ఆశ్రయించాడు. ఆన్‌లైన్ విధానం లేకపోవడంతో కంప్యూటర్ నుంచి జనన సర్టిఫికేట్‌ను ప్రింటర్ నుంచి ఇచ్చారు. అయితే జనార్దన్‌రెడ్డి పేరుకు సంబంధించి తప్పుగా రావడంతో తప్పును సరిద్దిమని ఇటీవల పంచాయతీ అధికారులను ఆశ్రయించాడు. తప్పులు సరిదిద్దడమైనదని ఆన్‌లైన్‌లో పత్రాన్ని తీసుకోమని చెప్పారు. మీ-సేవా కేంద్రానికి వెళ్లి రిజిస్టర్ నెంబర్ 47కు సంబంధించి పరిశీలిస్తే నిల్‌గా చూపించడంతో బాధితుడు కంగుతిన్నాడు. జరిగిన విషయాన్ని ఈఓ ప్రకృద్దిన్‌కు వివరణ కోరగా రిజిస్టర్ నెంబర్ 47 అక్రమ జనన నమోదుగా ఉన్నట్లు తేల్చిచెప్పారు.
నవంబర్ నెలలో 30 రోజులు అయితే 31గా నమోదు చేశారు
నవంబర్ నెలకు 30 రోజులు మాత్రమే ఉంటాయి. వెల్దుర్తి పంచాయతీలో మాత్రం అధికారులు 31 రోజూ ఉన్నట్లు సృష్టించి, జనార్ద్‌రెడ్డికి సంబందించిన జనన సర్టిఫికేట్‌లో నమోదు చేశారు. ఇలా జననానికి సంబంధించిన తప్పుల తడకగా నమోదు చేసినట్లు బయటపడ్డాయి.