
సాక్షి, బెంగళూరు : బీదర్ జిల్లా భాల్కి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ విజయ్ కుమార్ ఖండ్రే(60) కన్నుమూశారు. కేపీసీసీ కార్యాధ్యక్షుడు ఈశ్వర్ ఖండ్రే పెద్ద అన్న అయిన విజయ్ కుమార్ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.