
సాక్షి, విజయవాడ: ఏప్రిల్ 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త జిల్లాలను ప్రారంభించస్తారని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. 26 జిల్లాల ఏర్పాటుకి రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తాం. ప్రజల నుండి 17,500కి పైగా సూచనలు, అభ్యంతరాలు వచ్చాయి. మొత్తం 284 అంశాలపై ప్రజలు వినతులు వచ్చాయి. 90 శాతం అంశాలకు సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా పరిష్కరించారు.
కొన్ని మండలాలను ప్రజల డిమాండ్ మేరకు జిల్లాలు మార్చాం. పూర్తి శాస్త్రీయంగా ప్రజల సౌకర్యార్థం పునర్విభజన చేశాం. ప్రతి జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. అదనంగా రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశాం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన సాధించేలా జిల్లాల పునర్విభజన జరిగింది. ఏప్రిల్ 4 తర్వాత కేంద్ర ప్రణాళిక శాఖకు కొత్త జిల్లాలను పంపుతామని ప్రణాళిక కార్యదర్శి విజయ్‌కుమార్ అన్నారు.
చదవండి: (ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయి: సీఎం జగన్)