రాష్ట్రాల మధ్య సమన్వయంపై గురువారం విశాఖలో చర్చ జరిగింది.
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ బాగానే పనిచేస్తోందని చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ విజయ్ కుమార్ వెల్లడించారు. గురువారం విశాఖ జిల్లాలో రాష్ట్రాల మధ్య సమన్వయంపై చర్చ జరిగింది.
ఈ చర్చలో విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మావోయిస్టుల కార్యకలాపాలు 27 శాతం తగ్గాయని పేర్కొన్నారు.