సాక్షి, విశాఖపట్నం: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విశాఖ భూ అక్రమాలపై విచారణ కొనసాగుతోందని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చైర్మన్ విజయ్‌కుమార్ తెలిపారు. రూరల్ మండలాల్లో తహశీల్దార్లు నుంచి 431 నివేదికలు కోరామని, వీటిలో 140 వరకు రిపోర్ట్స్ వచ్చాయన్నారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయ్‌కుమార్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీడీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జారీ చేసిన 126 ఎన్ఓసిలపై క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నాం.
అదే విధంగా గతంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అనేది కూడా విచారిస్తున్నాం. ఎన్ఓసి విషయంలో ఉన్నతాధికారులు తప్పిదాలపై సిట్ నివేదికలో అన్ని అంశాలు పొందుపరుస్తాం. 22/A నిషేధిత భూముల విషయంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరుపుతున్నాం. సిట్ కాలపరిమితి ఈనెల 28 వరకు ఉంది. ఈ మధ్యలో సిట్ మిడ్ టర్మ్, ఫ్రీ ఫైనల్ నివేదిక ఇచ్చేందుకు సిద్ధం గా ఉన్నాం’’ అని స్పష్టం చేశారు.
చదవండి: ప్లాంట్‌పై అసెంబ్లీ తీర్మానం చేస్తాం: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment