ఉరియడి చిత్రంతో దర్శకుడిగా, నటుడిగా పరిచయమైన నటుడు విజయ్ కుమార్ ఆ తరువాత ఉరియడి 2 మూవీ తీసి హిట్ కొట్టారు. ఆ తరువాత సూర్య కథానాయకుడిగా నటించి, నిర్మించిన సూరరై పోట్రు చిత్రానికి సంభాషణలను అందించారు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేశారు.
రీల్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి అబ్బాస్ ఏ.రహ్మద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ అనంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు.
చదవండి: బాలీవుడ్ స్టార్ హీరోకు విలన్‌గా విజయ్ సేతుపతి? విలన్‌గా విజయ్ సేతుపతి?
కొత్త సినిమాలతో కళకళలాడుతున్న ఓటీటీ వరల్డ్
Comments
Please login to add a commentAdd a comment