
సూర్య తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని ఉరియడి–2 చిత్ర దర్శక, నటుడు విజయ్‌కుమార్ అంటున్నారు. ఈయన ఇంతకు ముందు ఉరియడి చిత్రాన్ని లోబడ్జెట్‌లో తెరకెక్కించి మంచి ప్రశంసలను అందుకున్నారు. తాజాగా దానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న చిత్రమే ఉరియడి–2. ఈ చిత్రం గురించి విజయ్‌కమార్ తెలుపుతూ ఉరియడి చిత్రంలో చర్చించిన జాతి, మత రాజకీయాలనే ఉరియడి–2లో మరింత బలంగా చెబుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సమాజంలో కుల, మతాలే పెద్ద సమస్యలన్నారు. వాటిని చర్చించేదే ఉరియడి–2 చిత్రం అని చెప్పారు.
తనకు కమ్యూనిస్ట్‌ల భావజాలమో, పుస్తకాలు చదివే అలవాటో లేదన్నారు. తనకు నచ్చింది సినిమా అని అన్నారు. దాన్ని మనస్ఫూర్తిగా చేయడమే తనలోని ప్రతిభకు తాను ఇచ్చే గౌరవం అని పేర్కొన్నారు. రంగంలోకి దిగి తాను ప్రజలకు చేసిందేమీ లేదని, అయితే వారిని చేరడానికి అనువైన మార్గం సినిమా అని అన్నారు. ఆఫ్ ఆల్ ది ఆర్ట్స్, ఫర్ అజ్ సినిమా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని లెనిన్ చెప్పారన్నారు. అదేవిధంగా కళల్లో సినిమా ప్రధానం అని ఒక కళాకారుడు అన్నారన్నారు. కాగా తప్పో ఒప్పో తనకు సరైనదనిపించింది సినిమా ద్వారా చెప్పాలనుకున్నాన్నారు. అదే సమయంలో తనలోని కళాకారుడిని అది తృప్తి పరచాలన్నారు.
ఉరియడి–2 చిత్రాన్ని నటుడు సూర్య తన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకాంపై నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఇక రోజు ఆ సంస్థ నిర్వాహకుడు రాజశేఖర్‌ను కలిసి ఈ చిత్ర కథ గురించి చెప్పానన్నారు.ఆయనకు కథ నచ్చడంతో పూర్తి కథను చెప్పానన్నారు. ఆ తరువాత నటుడు సూర్యకు కథ చెప్పానన్నారు. పూర్తి వెర్షన్ విన్న తరువాత ఆయన కొన్ని సందేహాలను అడిగారని, వాటిని వివరించడంతో బాగుంది కచ్చితంగా చిత్రం చేద్దాం అని అన్నారన్నారు. దీంతో తనకు చాలా నమ్మకం కలిగిందని చెప్పారు. కారణం ఉరియడి చిత్ర నిర్మాణం సమయంలో ఆర్థిక సమస్యల కంటే మానసికంగా చాలా బాధింపునకు గురైయ్యానని అన్నారు.
అలాంటిది ఉరియడి–2 చిత్రానికి సూర్య లాంటి నిర్మాత లభించడం చాలా మనశ్శాంతిగా ఉందన్నారు. ఆయన తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని, ఎలాంటి ఒత్తిడి లేకుండా చిత్రాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు విజయ్‌కుమార్ తెలిపారు. దీనికి గోవింద్ వసంత సంగీతాన్ని అందిస్తుండగా, ఉరియడి చిత్ర యూనిట్‌నే ఈ చిత్రానికి పని చేస్తోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment