హైదరాబాద్: నయీం ముఠా ఘాతుకం మరొకటి వెలుగులోకి వచ్చింది. 2013లో భువనగిరికి చెందిన వ్యాపారి విజయ్‌కుమార్‌ను తామే చంపినట్లు నయీం గ్యాంగ్ అంగీకరించింది. వీరిని విచారిస్తున్న సిట్ ఎదుట వారు ఈ విషయాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. నయీం చెల్లెలిని వివాహం చేసుకున్నాడన్న కోపంతోనే విజయ్‌కుమార్‌ను నయీంతో కలిసి చంపి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దతూప్రా వద్ద దహనం చేసినట్లు వెల్లడించారు. శంషాబాద్ రూరల్ పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సిట్ పోలీసులు మరిన్ని వివరాల కోసం నయీం గ్యాంగ్‌ను విచారిస్తున్నారు.