బావ, తమ్ముడి భార్య, ఆమె కూతురును హత్య చేసిన నయీమ్!
* వేరుగా ఉంటాం.. గ్యాంగ్ నుంచి వెళ్లిపోతాం అన్నందుకే..
* ఇప్పటికీ కానరాని మృతదేహాల ఆచూకీ
సాక్షి, హైదరాబాద్: సొంత కుటుంబీకులనూ నయీమ్ వదల్లేదు. తనకు అడ్డు చెబితే ఎంతటి దగ్గరి బంధువులనైనా హతమార్చేందుకూ తెగించాడు. సొంత తమ్ముడి భార్యను, అతడి కుమార్తెను పొట్టన పెట్టుకున్నాడు. ఆప్యాయంగా చూసుకున్న అక్క భర్తను కూడా చంపేశాడు. అంతేకాదు వీరి మృతదేహాల ఆచూకీ, ఆనవాళ్లు కూడా లేకుండా చేశాడు. ఇంతకీ వీరినెందుకు చంపాడన్న మిస్టరీ మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు. కేవలం గ్యాంగ్‌కు దూరంగా ఉంటామని, తాము వేరేగా బతుకుతామన్నందుకే నయీమ్ వీరిని హతమార్చినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురితోపాటు తన సమీప బంధువు, ఇంట్లో పని చేసిన నస్రీమ్‌ను సైతం నయీమ్ తన డెన్లోనే చంపేశాడు.
గ్యాంగ్ నుంచి వెళ్తానన్నందుకు బావను..
నయీమ్ సోదరి సలీమా భర్త పేరు విజయ్‌కుమార్ . న ల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన విజయ్‌కుమార్ అలియాస్ కొండా రాజుది నిరుపేద కుటుంబం. అక్కడే టైప్ ఇన్స్టిట్యూట్లో పని చేసేవాడు. నయీమ్ ఇంటి పక్కనే నివాసం ఉండే ఆయన గ్యాంగ్‌స్టర్ తమ్ముడు అలీముద్దీన్‌కు మంచి మిత్రుడు. అలీంతో కలిసి తిరిగిన విజయ్ క్రమంగా నేరాల్లోనూ పాలుపంచుకున్నాడు. తదనంతర పరిణామాల్లో అలీంకు రైట్ హ్యాండ్‌గా, నయీమ్‌కు నమ్మినబంటుగా మారాడు.
నత్తిగా మాట్లాడే విజయ్.. నయీమ్ గ్యాంగ్‌లో యాక్షన్ మెంబర్‌గా గుర్తింపు పొందాడు. నయీమ్ అప్పగించిన ప్రతి పనిని విజయ్ అనుకున్నట్లుగా పూర్తి చేస్తాడనే పేరుంది. అలీం హతమయ్యాక నయీమ్‌కు మరింత దగ్గరయ్యాడు. అప్పటికే నయీమ్ సోదరి సలీమా భర్త ఒక ప్రమాదంలో మరణించాడు. అదే సమయంలో ఆమెకు తోడుగా ఉండేందుకు ఒకరు అవసరమని.. విజయ్ను ఇచ్చి పెళ్లి చేయాలని నయీమ్ నిశ్చయించాడు. అప్పుడే విజయ్ పేరును నదీమ్‌గా మార్చాడు. వయస్సులో తనకంటే పెద్దదైన నా భాయ్ మాట ప్రకారం నదీమ్ సలీమాల పెళ్లి జరిగింది. ఆ తర్వాత తన నేరాలు.. ఘోరాలన్నింటా నదీమ్‌ను ముందు నిలబెట్టాడు.
అలీముద్దీన్‌ను హత్య చేసిన బెల్లి లలిత సోదరుడు ముక్కా కరుణాకర్ కేసులో నదీమ్ ఏ-1 నిందితుడు. కానీ.. కొంతకాలంగా అతడి జాడ లేదు. నయీమ్ గ్యాంగ్‌లోనూ కనిపించటం లేదు. కొంతకాలం తర్వాత తాను గ్యాంగ్ నుంచి వెళ్లిపోతానని నయీమ్‌కు చెప్పటం.. అది నచ్చకపోవటంతో నయీమ్ అతడిని చంపేశాడన్న అనుమానాలున్నాయి. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వంట మనిషి ఫర్హానా ఇచ్చిన సమాచారం మేరకు నదీమ్‌ను నయీమ్ చంపేసినట్లు వెలుగులోకి వచ్చింది.
సొంత వాళ్లనే చంపేశాడు..
Published Sun, Aug 14 2016 2:11 AM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM
Advertisement