టీఆర్‌ఎస్ శిక్షణపై టీడీపీ ఎద్దేవా
హైదరాబాద్: పరమానందయ్య శిష్యులకు పాఠాలు చెబుతున్నట్టుగా టీఆర్‌ఎస్ శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయని టీడీపీ విమర్శించింది. ఫిరాయింపు దారులతో నిండిన పార్టీ.. నీతిమంతమైన రాజకీయాలకు మారుపేరుగా నిలుస్తుందని చెప్పుకోవడం సిగ్గుచేటని ఆదివారం ఆపార్టీ రాష్ట్ర నాయకుడు మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారం చేస్తామని కేసీఆర్ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందన్నారు. అన్నదాతల ఆత్మహత్యలకు కారణమవుతున్నవారు ఇలాంటి ప్రకటనలు చేయడం విడ్డూరమని దుయ్యబట్టారు.
పరమానందయ్య శిష్యులకు పాఠాల్లా..
Published Mon, May 4 2015 2:56 AM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM
Advertisement
Advertisement