![More Delay in Tenth Class Results Release - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/4/10th-class-results.jpg.webp?itok=pRYY2glc)
హైదరాబాద్: టెన్త్ ఫలితాల విడుదల కాస్త ఆలస్యం అవుతుందని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయకుమార్ శనివారం తెలిపారు. హైదరాబాద్‌లో విజయ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. టెన్త్ ఫలితాలు విడుదల చేశాక ఆయా స్కూళ్ల హెడ్‌మాస్టర్ లాగిన్లతో విద్యార్థుల వివరాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి గ్రేడ్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసి ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఏ సబ్జెక్‌లోనైనా సున్నా వస్తే.. రీ చెక్ చేసిన తర్వాతే ఫైనల్ చేస్తామని చెప్పారు.
ఐదు అంచెలుగా పేపర్ చెక్ చేసి ఫైనల్ చేస్తున్నామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఆలస్యం ఐనా పక్కాగా ఫలితాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. పేపర్ వాలువేషన్ పూర్తి అయింది.. కానీ రీచెక్ చేస్తున్నాం.. అందుకే ఫలితాల విడుదల ఆలస్యమవుతుందని వెల్లడించారు. ఇంటర్ ఫలితాల విషయంలో పెద్ద గందరగోళం నెలకొనడంతో టెన్త్ ఫలితాల విడుదలలో ప్రభుత్వం కాస్త జాగ్రత్తపడుతున్నట్లుగా కనపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment