సాక్షి, హైదరాబాద్: విద్యారంగంలో మార్పులు, బలోపేతంపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. తెలంగాణ కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్, ముగ్గురు సభ్యులతో తెలంగాణ కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది.
చైర్మన్, సభ్యులు రెండేళ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. ప్రాథమిక నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర విధానం రూపకల్పనకు ఈ కమిషన్ పనిచేయనుంది.
కాగా, తెలంగాణలోని మల్టి జోన్-1,2 పరిధిలో నాయబ్ తహసీల్దార్లకు.. తహసీల్దార్‌గా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టి జోన్ 1-2 కలిపి 76 మందికి ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment