
సాక్షి,అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈనెల 12 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మొత్తం 16,208 పోస్టులు అందుబాటులో ఉండగా.. 10,63,168 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి రాతపరీక్షలు జరగనున్నాయి. (కొత్త పాలసీలో ‘వర్క్ ఫ్రం హోమ్’)
ఏడు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ఒక్కొక్కటి చొప్పున 14 రకాల రాత పరీక్షలు జరుగుతాయి. ఇందుకోసం పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఓఎమ్మార్ షీట్ల ముద్రణ ఇప్పటికే పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు మధ్య తగిన దూరం పాటిస్తూ.. పెద్ద తరగతి గదిలో 24 మంది చొప్పున, మధ్యస్తంగా ఉండే గదిలో 16 మంది చొప్పున సీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment