‘సచివాలయ’ నియామకాలు: కంట్రోల్‌ రూం నెంబర్లు | AP Village Ward Secretariat Exam Results Special Cell For Complaints | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 28 2020 2:37 PM | Last Updated on Wed, Oct 28 2020 2:44 PM

AP Village Ward Secretariat Exam Results Special Cell For Complaints - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ నియామకాలకు సంబంధించి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేశారు. సందేహాల నివృత్తి కోసం అభ్యర్థులు కమాండ్‌ కంట్రోల్‌ రూం నంబర్లు 9121296051/52/53కు ఫోన్‌ చేయవచ్చు. ఇక  గ్రామ సచివాలయం వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఇ-మెయిల్ ద్వారా అభ్యర్దులు తమ ఫిర్యాదులను లిఖిత పూర్వక౦గా పంపాల్సి ఉంటుంది. ఏ శాఖకు సంబంధించిన ఫిర్యాదు ఆ శాఖ మెయిల్‌కు మాత్రమే పంపించాలి. మెయిల్‌ ఐడీ వివరాల కోసం.. http://gramasachivalayam.ap.gov.in/లేదా http://vsws.ap.gov.in/ లేదా http://wardsachivalayam.ap.gov.in/సైట్లను సందర్శించవచ్చు.

కాగా కరోనా కష్టకాలంలోనూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం నెల వ్యవధిలోనే ఫలితాలను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 20 నుంచి 26 తేదీల మధ్య వారం రోజుల పాటు జరిగిన 14 రకాల రాత పరీక్షల ఫలితాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులందరికీ ఈసారి మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటించారు. ఆ ర్యాంకుల ఆధారంగా.. జిల్లాల వారీగా ఖాళీలను ఆయా జిల్లాల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో రిజర్వేషన్లు పాటిస్తూ మెరిట్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. నోటిఫికేషన్‌ ఇచ్చే నాటికి రాష్ట్రంలో 16,208 పోస్టులు ఖాళీగా ఉండగా.. ఫలితాలు వెల్లడించే నాటికి ఆ సంఖ్య 18,048కి పెరిగింది. జిల్లాల్లో మెరిట్‌ లిస్ట్‌ నుంచి కేటగిరీ ఆధారంగా 18,048 పోస్టులనూ భర్తీ చేయనున్నారు. (చదవండి: ‘సచివాలయ’ పరీక్షల ఫలితాల వెల్లడి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement