
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విడుదల చేశారు. 13 శాఖల్లో మిగిలిపోయిన 16,208 పోస్టుల భర్తీకి గాను గత నెల 20 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. 19 రకాల పోస్టుల కోసం 14 రకాల పరీక్షలు జరిపారు. దాదాపు 7.69 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుయ్యారు. రికార్డు సమయంలో ఓఎంఆర్ సమాధాన పత్రాలను స్కాన్ చేశారు. 7,68,965 మంది అభ్యర్థుల ఓఎంఆర్ సమాధాన పత్రాలను గత నెల 21 నుంచి 27వ తేదీ వరకు అధికారులు స్కాన్ చేశారు. ఆ ఫలితాలను ఆ రంగంలో నిష్ణాతులైన గణాంకాల బృందం (స్టాటిస్టికల్ టీమ్) ద్వారా మరోసారి పరిశీలించి.. నేడు తుది ఫలితాలను విడుదల చేశారు. (చదవండి: ఐరాస దృష్టికి సచివాలయ సేవలు)
Comments
Please login to add a commentAdd a comment