
ప్రతీకాత్మక చిత్రం
వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఘటనలు గంగాధర నెల్లూరు(చిత్తూరు )/గాలివీడు (వైఎస్సార్ జిల్లా): రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వలంటీర్లపై టీడీపీ నేతల దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలం కొర్లకుంట గ్రామ సచివాలయంలో తలముడిపి వలంటీర్ మల్లికార్జునపై టీడీపీ నాయకులు పేరం సోదరులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. తలముడిపి, కొర్లకుంటకు ఒకే సచివాలయం కావడంతో తలముడిపి సర్పంచ్ మద్దిరాల జ్యోతి, కొర్లకుంట సర్పంచ్ పేరం మేనక ప్రజలకు సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్లికార్జునపై కొర్లకుంట సర్పంచ్ పేరం మేనక బంధువులు పేరం ప్రభాకర్‌రెడ్డి, ఆనందరెడ్డి, మురళీరెడ్డి, చిన్న ఎరుకల్‌రెడ్డి మూకుమ్మడిగా దాడి చేశారు. వలంటీర్ ఫిర్యాదు మేరకు పేరం సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చిత్తూరు జిల్లాలో..
చిత్తూరు జిల్లా గాంగాధర నెల్లూరు మండలం గొల్లపల్లి వలంటీర్ గాయత్రి ఇంటిముందు టీడీపీ నేతల ఇళ్ల నుంచి వచ్చిన మురుగు చేరి దుర్వాసన వెదజల్లుతోంది. దీనిపై ప్రశ్నించినందుకు గాయత్రి, కుటుంబీకుడు మాధవమందడిపై గురువారం మూకుమ్మడిగా దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలు లోకనాథనాయుడు, కమలేష్‌నాయుడు, హేమాద్రినాయుడు, కిషోర్‌నాయుడు, యుగంధర్‌పై కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment