
సాక్షి, విజయవాడ: ఈ నెల 9న వలంటీర్ల ఆవేదనా సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు వాలంటీర్లకు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఎనిమిది కేబినెట్ మీటింగ్‌లు జరిగినా వాలంటీర్ల గురించి ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు. నవంబర్ 6వ తేదీన జరగనున్న క్యాబినెట్‌లో వాలంటీర్లకు న్యాయం చేయాలన్నారు. ఎన్నికల హామీ ప్రకారం 10 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని, బకాయిపడ్డ ఐదు నెలల గౌరవ వేతనం చెల్లించాలని ఈశ్వరయ్య విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment