
Anantapur: రేషన్ కార్డులో కుమారుడి పేరు నమోదు చేసుకోవడానికి వెళ్తే.. మీ కుమారుడు చనిపోయినట్లు ఆన్‌లైన్‌లో చూపుతోందని చెప్పడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. హంప గ్రామానికి చెందిన దూదేకుల కుల్లాయమ్మ, మస్తాన్‌వలి మూడేళ్ల క్రితం జీవనోపాధి కోసం అనంతపురానికి వెళ్లారు.
ఇంటర్ చదువుతున్న కుమారుడు కుల్లాయప్ప పేరు రేషన్‌కార్డులో నమోదు చేయించుకునేందుకు వారు స్వగ్రామానికి వచ్చారు. జనన ధృవీకరణ పత్రం తీసుకుని అనంతపురం సచివాలయానికి వెళ్లారు. అయితే అక్కడ సిబ్బంది ‘మీ కుమారుడు చనిపోయినట్లు ఆన్‌లైన్‌లో చూపుతోంది. మేమేం చేయలేం’ అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి కార్డులో పేరు నమోదు చేసి న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment